Google Pixel 9 : సూపర్ ఆఫర్ భయ్యా.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. త్వరపడండి..!

Google Pixel 9 : గూగుల్ పిక్సెల్ 9 ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.

Google Pixel 9 : సూపర్ ఆఫర్ భయ్యా.. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. త్వరపడండి..!

Google Pixel 9

Updated On : August 26, 2025 / 2:00 PM IST

Google Pixel 9 : గూగుల్ పిక్సెల్ ప్రియులకు గుడ్ న్యూస్.. పిక్సెల్ 9 ధర భారీగా తగ్గింది. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ అయిన వెంటనే పిక్సెల్ 9 సిరీస్ ధర (Google Pixel 9) ఒక్కసారిగా తగ్గింది. బేస్ వేరియంట్ ధర అతి చౌకైన ధరకే లభిస్తోంది. మీరు చేయాల్సిందిల్లా.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడమే.. ఇలా కొన్నారంటే డిస్కౌంట్ ధరకే పిక్సెల్ 9 ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ధర తగ్గింపు :

గూగుల్ పిక్సెల్ 9 మోడల్ 12GB ర్యామ్ వేరియంట్, 256GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ ఫోన్ అసలు ధర రూ. 79,999 ఉండగా తగ్గింపు ధరతో కేవలం రూ. 64,999కే కొనేసుకోవచ్చు.

అంతేకాదు.. ఆసక్తిగల కొనుగోలుదారులు HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐతో అదనంగా రూ. 7వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే, ఈ పిక్సెల్ 9 ఫోన్ మొత్తం వాటర్ మిలాన్, పొర్సెలియన్, పియోనీ, అబ్సిడియన్ అనే 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Zero GST : హెల్త్ ఇన్సూరెన్స్ పై జీరో జీఎస్టీ? వచ్చే నెలలో తేలిపోనుంది.. ఏయే వస్తువులు చౌకగా దొరకనున్నాయంటే? ఫుల్ డిటెయిల్స్..

Google Pixel 9 : పిక్సెల్ 9 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :

గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 6.3 అంగుళాల OLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంది. కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్యానెల్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. 7 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ కూడా అందుకుంటుంది. గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్, మాలి G15 MC ప్రాసెసర్‌లపై రన్ అవుతుంది.

కెమెరాల విషయానికి వస్తే.. డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 50MP ప్రైమరీ షూటర్, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ (OIS), 48MP వైడ్ యాంగిల్ షూటర్ వంటి ఫీచర్లు కలిగి ఉంది.

కెమెరా ఫీచర్లలో పిక్సెల్ షిఫ్ట్, బెస్ట్ టేక్, సింగిల్ జోన్ లేజర్ ఏఎఫ్ వంటివి ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 10.5MP ఫ్రంట్ స్నాపర్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. 27W ఛార్జింగ్ వైర్డ్ సపోర్టు, 15W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది.