Planting of Mango Plants : మామిడి మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హైడెన్సిటీ పద్ధతిలో నాటుకుని, ఏటా కొమ్మ కొత్తరింపుల ద్వ్రారా మొక్కల ఎత్తును నియంత్రిస్తే మంచి దిగుబడి సాధించే వీలుంది. మొక్కలు త్వరగా నాటుకుని అభివృద్ధి చెందటానికి తక్కువ వర్షపాతం వున్న ప్రాంతాల్లో  జూన్ - జూలై మాసంలోను , ఎక్కువ వర్షపాతంగల ప్రాంతాల్లో నవంబరు - డిసెంబరు మాసాల్లో నాటటానికి అనుకూలం.

Planting of Mango Plants : మామిడి మొక్కలు నాటటానికి జూన్ – డిసెంబరు వరకు అనుకూలమైన సమయం. సంప్రదాయ సాగు విధానంలో మామిడి నాటితే ఎకరానికి 20-40 మొక్కలకు మించిరావు. కానీ ఇప్పుడు అధిక సాంద్రపద్ధతిలో మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి నాటటం వల్ల ఎకరానికి160కు పైగా మొక్కలు నాటుకునే అవకాశం ఏర్పడింది. ఈ విధానంలో నాటిన 3వ సంవత్సరం నుంచే రైతులు అధిక దిగుబడిని సాధిస్తున్నారు.

READ ALSO : Dried Mango Slices : మామిడి ఒరుగుల తయారీ.. 3 నెలల్లో 12 కోట్ల టర్నోవర్

ప్రస్థుతం మామామిడి మొక్కలు నాటుకునే సమయం. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపికచేసుకుని, నాణ్యమైన అంటు మొక్కలను రైతులు ఎంపిక చేసుకోవాలి. మామిడి నాటేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి తోటల సాగు అన్ని రకాల నేలలు అనుకూలంగా వుంటాయి. కాని  లోతు ఎక్కువ వున్న నెలల్లో వేర్లు విస్తారంగా  వ్యాపించి ,చెట్లు బాగా అభివృద్ధి చెందుతాయి. దీర్ఘకాలంపాటు మంచి  ఫలసాయాన్నిస్తాయి. చౌడు , ఉప్పు , సున్నం ,నీరు నిలువ ఉండే బరువైన నల్లరేగడి నేలలు మామిడి సాగుకు అనుకూలం కాదు. ఆయాప్రాంతాల మార్కెట్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మామిడి రకాలను ఎంపికచేసుకోవాలి.

READ ALSO : Decreasing Mango Yield : తగ్గిన మామిడి దిగుబడి.. ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలు

సాధారణంగా మామిడిలో కోత రకాలు, రసభరిత రకాలు, కోతతోపాటు జ్యూస్ కు పనికొచ్చే రకాలు,పచ్చడి రకాలు అందుబాటులో వున్నాయి. కోత రకాల్లో బంగినపల్లి, హిమాయత్, దశేరి, కీసర్ రకాలను ఎంపికచేసుకోవచ్చు. రసభరిత రకాల్లో చిన్నరసం, పెద్దరసం, చెరకురసం రకాలు వున్నాయి. కోతతోపాటు, జ్యూస్ కు పనికొచ్చే రకాల్లో మల్లిక, తోతాపురి, మెహమూదా వికారాబాద్, ఆమ్రపాలి వంటి రకాలు అందుబాటులో వన్నాయి.

పచ్చడి రకాల్లో ఆమిని, జలాలు, తెల్లగులాబీ వంటి రకాలు వేసుకోవచ్చు. ఇక ఆఫ్ సీజన్ లో సైతం అంటే వేసవితోపాటు, శీతాకాలంలో దిగుబడినిచ్చే పునాస రకాలను సాగుచేసే రైతాంగం రాయల్ స్పెషల్, బారమాసీ, తంబువ వంటి రకాలను ఎంచుకోవాలి. మార్కెట్ డిమాండ్ వున్న రకాలను అధిక విస్తీర్ణంలో సాగుచేసి, మిగతా రకాలను కూడా కలిపి సాగుచేసుకుంటే రైతు మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చు.

READ ALSO : Mango Slices : మామిడికాయ ముక్కల ఎగుమతితో అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతులు

నాణ్యమైన అంటుమొక్కలను నమ్మకమైన నర్సరీల నుండి ఎంపిక చేసుకోవాలి. మొక్కల వయసు కనీసం 8 నెలలు వుండాలి. మొక్కలను కొనుగోలుచేసేటప్పుడు వేరుమూలం, సయాను బాగా అతికివున్న మొక్కలను ఎన్నిక చేసుకోవాలి. వేరు మూలంపై కొత్త చిగుర్లు లేని మొక్కలను నాటేందుకు ఉపయోగించాలి.

సంప్రదాయ పద్ధతిలో మామిడి నాటితే ఎకరానికి 20-40  మొక్కలు మించి రావు. వీటినుంచి ఆశించిన దిగుబడి పొందాలంటే 10సంవత్సరాల సమయం పడుతుంది. అదే అధిక సాంద్ర పద్ధతిలో అంటే  మొక్కల మధ్య ఎటుచూసినా 7.5 X 7.5 మీటర్ల ఎడంతో నాటితే ఎకరానికి 71మొక్కలు వస్తాయి. అదే 5 x 5మీటర్ల ఎడంతో నాటితే ఎకరానికి 160 మెక్కలు వస్తాయి. ఇంకా దూరం తగ్గించి ఎకరాకు 180-220 మొక్కలు నాటుకునే అవకాశం వుంది.

READ ALSO : Mango Packing House : మామిడి ప్యాకింగ్ హౌస్ కి ఏపి ప్రభుత్వ సబ్సిడీ

ఈ విధంగా హైడెన్సిటీ పద్ధతిలో నాటుకుని, ఏటా కొమ్మ కొత్తరింపుల ద్వ్రారా మొక్కల ఎత్తును నియంత్రిస్తే మంచి దిగుబడి సాధించే వీలుంది. మొక్కలు త్వరగా నాటుకుని అభివృద్ధి చెందటానికి తక్కువ వర్షపాతం వున్న ప్రాంతాల్లో  జూన్ – జూలై మాసంలోను , ఎక్కువ వర్షపాతంగల ప్రాంతాల్లో నవంబరు – డిసెంబరు మాసాల్లో నాటటానికి అనుకూలం. మామిడి మొక్కలు నాటుకునే నెల ముందు గుంతలు తీయాల్సి వుంటుంది.

1మీటరు పొడవు, వెడల్పు, లోతు వుండేటట్లుగా గుంతలు తవ్వాలి. నాటటానికి ముందు 50కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 2కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, చెదలు రాకుండా 100గ్రాముల ఫాలిడాల్ పొడిని తవ్విన మట్టిలో కలిపి గుంతలు నింపాలి. తర్వాత మొక్కలను పాలిధిన్ కవర్లను చింపి  నాటాలి. అంటు మొక్కను మట్టిగడ్డతో సహా తీసి వేర్లు కదిలించకుండా గుంత మధ్యలో నాటి, గాలిపోకుండా మట్టిని గట్టిగా నొక్కాలి. మొక్క కదలకుండా చిన్న కొయ్యపాతి కదలకుండా కట్టాలి.

READ ALSO : Mango Farming : మామిడిలో కాయ,పిందె దశలో చేపట్టాల్సిన యాజమాన్యచర్యలు!

నాటిన వెంటనే ఒకటిన్నర అడుగుల వెడల్పు పాదులుచేసి నీరు ఇవ్వాలి . నిర్ధేశించిన దూరంలో మొక్కల మధ్య ఎడం పాటించాలి. తర్వాత 8 నుంచి 10 రోజుల కొకసారి వర్షాలు లేనప్పుడు నీరుపోసి 2సంవత్సరాల వరకు మొక్కలను సంరక్షించాలి. హైడెన్సిటీ విధానంలో మామిడి నాటిన 5వ సంవత్సరం నుండి రైతుకు ఆర్ధిక ఫలితాలు ఆశాజనకంగా వుంటాయి. మొదటి 3,4 సంవత్సరాలు అంతరపంటల సాగుతో ఆదాయం పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు