Mango Slices : మామిడికాయ ముక్కల ఎగుమతితో అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతులు

ఆవకాయ తయారీలోనే ప్రఖ్యాతి పొందింది ఎన్టీఆర్ జిల్లా. గతంలో ఇక్కడి రైతులు పండిన పంటను దళారులకు అమ్ముకునేవారు. అయితే మార్కెట్లో సరైన ధర పలకకపోవడంతో కొన్నేళ్లుగా మామిడి ఊరగాయ ముక్కలను తయారుచేస్తూ.. దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ... అధిక లాభాలను ఆర్జిస్తున్నారు .

Mango Slices : మామిడికాయ ముక్కల ఎగుమతితో అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతులు

Export of Mango Slices

Mango Slices : మామిడికాయ బద్దకు కాస్త ఉప్పూ కారం, ఆవాల పొడి అద్ది.. ఆపై నూనెలో ఈత కొట్టించి.. నలభీమ పాకాన్ని మరిపించే రుచిని సాధించిన గొప్పతనం తెలుగువారిది. పేదవాడి ఇంటిలోను రాజుల ఇంటిలో సైతం ఉండి జిహ్వకు  మధురమైన రుచిని అందించి ఆకలిని తీర్చేదీ… ఎక్కడ ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ తరతరాలుగా అందరి ఇళ్ళల్లోను ఇది ఉంటుంది. కూరవండలేదని భర్త మండిపడితే ఆకోపాన్ని తగ్గించి విందు భోజనంవలె లొట్టలేసుకుంటూ తినేలా చేస్తుంది. బడినుంచి వచ్చిన పిల్లలకు అన్నంలో యింత నెయ్యి వేసి, ఇది వేస్తే కంచం ఖాళీ చేసి పోతారు పిల్లలు.

READ ALSO : Jeedi Mamidi Cultivation : తగ్గిన జీడిమామిడి దిగుబడి.. ఆందోళనలో రైతులు

ఇప్పుడంటే దమ్ బిర్యాని, వెజిటబుల్ బిర్యాని , పలావ్ అంటూ పలురకాలైన వంటలు వచ్చి విందు లో చోటు చేసుకున్నాయి కానీ నాటికాలంలో ఇంటికివచ్చిన అతిధికి ముద్దపప్పు, నెయ్యితో పాటుగా ఈ పదార్ధం  వేయకుండా విందు భోజనం సంపూర్తి అయ్యేది కాదు. నాటి కాలంలో పెళ్లిళ్లకు, విందులకు ఇది ఖచ్చితంగా ఉండితీరాల్సిందే. అందేంటిది అనుకుంటున్నారా.. అదే నండి మామిడికాయ పచ్చడి.

READ ALSO : Mango Farming : మామిడి తోటలకు ఆలస్యంగా పూత, కాత.. కాయలు నిలిచేందుకు శాస్త్రవేత్తల సూచనలు

అలాంటి ఆవకాయ తయారీలోనే ప్రఖ్యాతి పొందింది ఎన్టీఆర్ జిల్లా. గతంలో ఇక్కడి రైతులు పండిన పంటను దళారులకు అమ్ముకునేవారు. అయితే మార్కెట్లో సరైన ధర పలకకపోవడంతో కొన్నేళ్లుగా మామిడి ఊరగాయ ముక్కలను తయారుచేస్తూ.. దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ… అధిక లాభాలను ఆర్జిస్తున్నారు .ఇప్పుడు ఆ పచ్చడిని దేశంలోని అన్ని రాష్ట్రాల వారు ఇష్టంగా తింటున్నారు. దీంతో మామిడికాయకు మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే.. వ్యాపారులు మాత్రం రైతులకు తక్కువ ధరే చెల్లిస్తూ.. కొనుగోలు చేసి.. వారు లాభాలు పొందుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు తగ్గుతున్న దిగుబడులతో.. మామిడి పండించే రైతులు నష్టాల పాలవుతున్నారు.

READ ALSO : Soak Mango : మామిడికాయను తినే ముందు నీటిలో నానబెట్టడం అవసరమా? దాని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే ?

అయితే ఎన్టీఆర్ జిల్లాలోని  రెడ్డిగూడెం , విస్సన పేట, నూజివీడు మండలాల కొందు రైతులు మామిడికాయలను కొనుగోలు చేసి వాటిని పచ్చడి ముక్కలుగా కట్ చేసి ఉప్పులో ఊరబెడుతున్నారు. వాటిని దేశంలో పచ్చళ్లు తయారుచేసే కంపెనీలకు ఎగుమతి చేస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ విధానంతో ఇటు మామిడి రైతులకు సైతం అధిక ధర అందుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.