Jeedi Mamidi Cultivation : తగ్గిన జీడిమామిడి దిగుబడి.. ఆందోళనలో రైతులు

ఈ ఏడాది వాతావరణ మార్పులు, ఆకాల వర్షాల కారణంగా పూత ఆలస్యంగా వచ్చింది. మరోవైపు తేమశాతం పెరగడం, ఫిబ్రవరిలో అధికంగా పొగమంచు కురవడం, మార్చిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పూత మాడిపోయింది. దీనికి తోడు టీదోమ ఆశించడం వల్ల ఈ ఏడాది దిగుబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Jeedi Mamidi Cultivation : తగ్గిన జీడిమామిడి దిగుబడి.. ఆందోళనలో రైతులు

Jeedi Mamidi Cultivation

Jeedi Mamidi Cultivation : ఈ ఏడాది గిరిజన రైతుల పట్ల, ప్రక్రతి కన్నెర్ర చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా,  ఏజెన్సీ ప్రాంతంలో చింతపండుతో పాటు, అధికంగా జీడిమామిడి సాగు అవుతుంది . ఈ పంటే గిరిజన రైతులకు ప్రధాన ఆదాయవనరు. అయితే ఈ ఏడాది , వాతావరణ మార్పులు, అధిక వర్షాల కారణంగా జీడిమామిడి పూత ఆలస్యమైంది. వచ్చిన పూత నిలబడటంలేదు. దీంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.

READ ALSO : Jeedi Mamidi Cultivation : జీడిమామిడి పూత, కాత ఆలస్యం.. కాయలు నిలిచేందుకు శాస్త్రవేత్తల సూచనలు

ఏజెన్సీ ప్రాంతామైన పార్వతీపురం మన్యం జిల్లాలో, జీడిమామిడి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు రైతులు. ఐటిడీఏ పరిధిలో ఉన్న గుమ్మలక్ష్మీపురం, కురపాం, జియ్యమ్మవలస, సాలూరు మండలాల్లో దాదాపు 18 వేల ఎకరాల్లో జీడితోటలు సాగవుతున్నాయి.

READ ALSO : Cashew : జీడి మామిడిలో పూత,కాత దశలో సస్యరక్షణ

అయితే ఈ ఏడాది వాతావరణ మార్పులు, ఆకాల వర్షాల కారణంగా పూత ఆలస్యంగా వచ్చింది. మరోవైపు తేమశాతం పెరగడం, ఫిబ్రవరిలో అధికంగా పొగమంచు కురవడం, మార్చిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పూత మాడిపోయింది. దీనికి తోడు టీదోమ ఆశించడం వల్ల ఈ ఏడాది దిగుబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Areca nut Cultivation : ఒక్కసారి నాటితే 20 ఏళ్ల వరకు దిగుబడి.. వక్కసాగుతో లాభాలు పక్కా

మే నెలాఖరికి జీడి మామిడి పంట ముగింపుకు వస్తుంది. ఎకరాకు 20 శాతం కూడా వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. కాబట్టి వచ్చే ఏడాదన్నా,  దిగుబడుల పెరగాలంటే, ముందస్తుగా సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు ఉద్యానశాఖ అధికారి కళ్యాణి.