Jeedi Mamidi Cultivation : జీడిమామిడి పూత, కాత ఆలస్యం.. కాయలు నిలిచేందుకు శాస్త్రవేత్తల సూచనలు

విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా జీడిమామిడిది ప్రత్యేక స్థానం. కోస్తాతీర ప్రాంతాలైన శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు దీనిని సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఇటీవలికాలంలో ఈ పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.

Jeedi Mamidi Cultivation : జీడిమామిడి పూత, కాత ఆలస్యం.. కాయలు నిలిచేందుకు శాస్త్రవేత్తల సూచనలు

Jeedi Mamidi Cultivation

Jeedi Mamidi Cultivation : అధిక వాణిజ్య విలువ వున్న  పంట జీడిమామిడి. మన దేశం జీడిమామిడి విస్తీర్ణంలోనూ, ఉత్పాదకతలోనూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరప్రాంతంలో ఈ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. అయితే ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పూత ఆలస్యమైంది. వచ్చిన పూత నిలబడటంలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని యాజమాన్య పద్దతులు పాటించినట్లైతే పూతను నిలబెట్టుకవచ్చిని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చిట్టిబాబు.

READ ALSO : Custard Apple Cultivation : సీతాఫలం సాగులో మెళుకువలు ! పంటసాగులో అనువైన రకాలు

విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా జీడిమామిడిది ప్రత్యేక స్థానం. కోస్తాతీర ప్రాంతాలైన శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు దీనిని సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఇటీవలికాలంలో ఈ పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఇందుకు గల కారణాలను గమనిస్తే.. పిక్క తోటలను వేయటం, ఎరువుల యాజమాన్యం పట్ల అశ్రద్ద, సస్యరక్షణపై అవగాహణ లేకపోవటం… దీనివల్ల చీడపీడల సమస్య ఎక్కువగా వుండి, దిగుబడులు నామమాత్రంగా వుంటున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో, పూత ఆలస్యంగా వచ్చింది. వచ్చిన పూత అధిక ఉష్ణగ్రతల కారణంగా పూత ఎండి , రాలిపోతుంది.  దీంతో శ్రీకాకుళం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Mango Farming : మామిడి తోటలకు ఆలస్యంగా పూత, కాత.. కాయలు నిలిచేందుకు శాస్త్రవేత్తల సూచనలు

ప్రస్తుతం జీడితోటలన్నీ పూత, పిందె దశల్లో వున్నాయి. అయితే  వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, పిందె రాలిపోతుంది. ఈదశలో సిఫారసు చేసిన మందులను మాత్రమే పిచికారీ చేస్తూ.. సూక్ష్మపోషకాల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నారు, శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చిట్టిబాబు.

READ ALSO : ఆ పాలు తాగితే అంతే సంగతులు : గేదెలు, ఆవులకు నిషేధిత ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు

ఒకప్పుడు జీడిమామిడి తోటలు దెబ్బతింటే, ప్రభుత్వం నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోనేవారు. కానీ గత మూడేళ్లుగా , ప్రకృతి వైపరిత్యాలతో పంటలు దెబ్బతింటున్నా, ఎలాంటి సాయం అందడం లేదని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి.. జీడిమామిడి రైతులను ఆదుకోవాలని  కోరుకుంటున్నారు.