Mango Farming : మామిడి తోటలకు ఆలస్యంగా పూత, కాత.. కాయలు నిలిచేందుకు శాస్త్రవేత్తల సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది  మామిడికి గడ్డుపరిస్థితులే తలెత్తాయి. సాధారణంగా నవంబర్ , డిసెంబర్ లో మామిడి పూత రావాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా మార్చినెలలో రావడం.. వచ్చిన పూత కూడా ఎండిపోతుంది. అయితే ఉన్న పూత, పిందెను కాపాడుకోవాలంటే మేలైన ఎరువుల యాజమాన్యం  పాటించాలని రైతులకు సూచిస్తున్నారు 

Mango Farming : మామిడి తోటలకు ఆలస్యంగా పూత, కాత.. కాయలు నిలిచేందుకు శాస్త్రవేత్తల సూచనలు

Mango Farming Techniques

Mango Farming : ప్రపంచ ప్రఖ్యాత చెందిన మామిడి రకాల్లో బంగినపల్లి ఒకటి. మార్కెట్లో కనిపిస్తే ఎప్పుడు తినేద్దామా అనిపించని రోజనుండదు. తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పండే బంగినపల్లి మామిడి రుచి ప్రత్యేకమైంది. ఈ పండకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది. కానీ వాతావరణ మార్పులు, అకాల వర్షాల కారణంగా.. ఈ ఏడాది మామిడి పూత ఆలస్యంగా వచ్చింది. వచ్చిన పూత రాలిపోతుండటంతో  ప్రకాశం జిల్లా మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఉన్న పూతను కాపాడుకోవాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాలని సూచిస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు.

READ ALSO : Mango Farmers: రైతులకు మామిడి కష్టాలు

ప్రకాశం జిల్లా, ఉవలపాడు మండలం మామిడి తోటలకు ప్రసిద్ధి. దాదాపు 8 నుండి 10 వేల ఎకరాల్లో మామిడి సాగవుతుంటుంది. ముఖ్యంగా మామిడి పండ్లలో రారాజు అయిన బంగినపల్లిని ఇక్కడ అధికంగా సాగుచేస్తుంటారు రైతులు. ప్రతి ఏడాది ఈ సమయానికి, ఇక్కడి నుండి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. కానీ ఈ ఏడాది అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా, మామిడిపూత ఆలస్యంగా వచ్చింది. వచ్చిన పూత చెట్టుపై నిలవడంలేదు. ప్రస్తుతం ఉన్న కాతను చూస్తూ.. 10 శాతం కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు  వాపోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది  మామిడికి గడ్డుపరిస్థితులే తలెత్తాయి. సాధారణంగా నవంబర్ , డిసెంబర్ లో మామిడి పూత రావాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా మార్చినెలలో రావడం.. వచ్చిన పూత కూడా ఎండిపోతుంది. అయితే ఉన్న పూత, పిందెను కాపాడుకోవాలంటే మేలైన ఎరువుల యాజమాన్యం  పాటించాలని రైతులకు సూచిస్తున్నారు. ఉలవపాడు మండలం ఉద్యానశాఖ అధికారి బహ్మసాయి.

READ ALSO : Mango Plantations : మామిడి తోటల్లో కలుపు నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

జనవరి, ఫిబ్రవరిలో చలి తీవ్రత వల్ల తోటల్లో తెగుళ్లు, చీడపీడల ఉధృతి పెరిగింది. తేనెమంచు, బూడిద తెగులు, రసంపీల్చే పురుగులు కనిపిస్తున్నాయి. ఇవి పూత, పిందె, కాయ దశల్లో చెట్లను ఆశించి, ఎక్కువగా నష్టపరుస్తున్నాయి. ప్రస్తుతం మామిడి పంటలో తేనెమంచు పురుగు, తామర పురుగులు, బూడిద తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నది. నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు.

వాతావరణ మార్పులు.. ఫలరాజు పై పగబట్టాయి. డిసెంబర్‌లో మొదలైన చలి, సంక్రాంతికి చుట్టుముట్టిన పొగ మంచు.. మామిడి తోటలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇప్పటికే పూత ఆలస్యం కావడంతో పాటు, వచ్చిన పిందెలు కూడా రాలిపోతున్నాయి. ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు వల్ల పలు రకాల తెగుళ్లు సోకుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ మామిడి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ సమయంలో పూత, పిందెను పాడుకోకుంటే..తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.