SIP Calculator : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి.. జస్ట్ రూ. 100 SIPతో రూ. 30 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.. అల్టిమేట్ గైడ్ మీకోసం..!
SIP Calculator : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా? మీరు SIP ద్వారా రూ. 100 వరకు పెట్టుబడితో రూ. 30 లక్షలు కూడబెట్టుకోవచ్చు. అది ఎలాగంటే?
SIP Calculator
SIP Calculator : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లపై ఆసక్తి చూపుతున్నారు. మీరు మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి లేదా SIP ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. సాధారణంగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ని ఎంచుకుంటారు.
ఎందుకంటే.. ఈ ఎస్ఐపీ పెట్టుబడుల (SIP Calculator) వాయిదాలలో డబ్బును పెట్టుబడి పెట్టుకోవచ్చు అనమాట. ఉదాహరణకు.. మీరు రోజుకు రూ. 100 పెట్టుబడి పెడితే రూ. 30 లక్షలు సంపాదించడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఫండ్‌లో ఎస్ఐపీ ద్వారా రోజుకు రూ. 100 పెట్టుబడిపై ఎంత మొత్తంలో రాబడి వస్తుందో ఎస్ఐపీ క్యాలికేటర్ ద్వారా తెలుసుకుందాం..
లెక్కింపు ఇలా :
- రోజుకు మొత్తం రూ. 100 పెట్టుబడి
- పెట్టుబడిపై 12 శాతం రాబడి
నష్టాలు వస్తే ఏం చేయాలి?
ఒక వ్యక్తి SIPలో రోజుకు రూ. 100 పెట్టుబడి పెడితే 20 ఏళ్ల నుంచి 21 ఏళ్లలో 12శాతం రాబడిపై రూ. 30 లక్షలు సంపాదించుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లు ఎల్లప్పుడూ లాభాలను ఇస్తాయని కాదు.. మనం 4 లేదా 5 నెలలుగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతూ నష్టాలను కూడా చవిచూడాల్సి వస్తుంది. మీరు 4 లేదా 5 నెలలుగా నష్టాలను ఎదుర్కొన్నా సరే పెట్టుబడిని కొనసాగించాలి. ఎందుకంటే.. ఈక్విటీ ఫండ్లలో అస్థిరత సాధారణమే.
కొన్ని నెలలు నష్టాలు కొనసాగినా, పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి. మార్కెట్ హెచ్చుతగ్గులు సర్వసాధారణం. కాబట్టి, నష్టాలు సంభవిస్తే పెట్టుబడిదారులు ఆందోళన చెందాలి. ఈ సమయాల్లో మీరు మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మ్యూచువల్ ఫండ్ క్షీణిస్తున్నప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయంగా భావించాలి. ఈ సమయాల్లోనే మీరు తక్కువ ధరలకు ఎక్కువ ఈక్విటీలను కొనుగోలు చేయవచ్చు.
Disclaimer : మ్యూచువల్ ఫండ్లపై పెట్టుబడి సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ రిస్క్ ఉండవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు మీకు తెలిసిన పెట్టుబడి సలహాదారుని సంప్రదించండి.
