India Squad: టీమిండియాకు కొత్త కెప్టెన్.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన..

సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టులోకి తీసుకున్నారు.

India Squad: టీమిండియాకు కొత్త కెప్టెన్.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన..

Updated On : November 23, 2025 / 6:27 PM IST

India Squad: భారత జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా ప్రకటించారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును అనౌన్స్ చేసింది. మూడు వన్డేల సిరీస్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. బుమ్రా, సిరాజ్ కు రెస్ట్ ఇచ్చారు. శుభ్ మన్ గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.

వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాట టీ20 సిరీస్ (5 మ్యాచులు) ఉంటుంది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. ఇంకా కోలుకోకపోవడంతో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ ను తాత్కాలిక కెప్టెన్‌గా ప్రకటించారు. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా-ఎ టీమ్ తో జరిగిన అనధికార వన్డేల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రుతురాజ్ గైక్వాడ్‌ను వన్డే జట్టులోకి ఎంపిక చేశారు.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు భారత జట్టు..
రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితిశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ధృవ్ జురెల్.

Also Read: కొద్ది గంటల్లో పెళ్లి.. సడన్ గా ఆగిన స్మృతి మంథాన వివాహం.. కారణం ఇదే..