Soak Mango : మామిడికాయను తినే ముందు నీటిలో నానబెట్టడం అవసరమా? దాని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే ?

మామిడిలో ఉండే కొన్ని కలుషిత పదార్థాలను తొలగించుకోవాలంటే పండ్లను ముందుగా నీటిలో నానబెట్టాలి. నానబెట్టకుండా తినడం వల్ల ముఖం, శరీరంపై మొటిమలు, గడ్డలు వంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా కడుపులో వేడిని పెంచుతుంది, మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్ , ఇతర జీర్ణశయాంతర సమస్యలకు దారితీస్తుంది.

Soak Mango : మామిడికాయను తినే ముందు నీటిలో నానబెట్టడం అవసరమా? దాని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే ?

soak mangoes before eating

Updated On : April 28, 2023 / 6:35 PM IST

Soak Mango : వేసవిలో విరివిగా లభించే పండ్లలో మామిడి కూడా ఒకటి. పండ్లలో రారాజుగా మామిడిని చెప్పవచ్చు. అంతా ఈ పండును ఇష్టంగా తింటారు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమన్లు అధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ పండ్లను తినాలనుకుంటే ముందుగా నీళ్ల లో కొంత సమయం నానబెట్టటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్నో ఏళ్లకాలంలో ఇదే విధానాన్ని చాలా మంది అనుసరిస్తూ వస్తున్నారు. అయితే ఇలా ఎందుకు చేయాలో చాలా మందికి పూర్తిస్ధాయి అవగాహన లేదు.

READ ALSO : Green Mango : వేసవిలో రోగనిరోధక శక్తిని పెంచే పచ్చి మామిడికాయ!

మామిడిలో ఉండే కొన్ని కలుషిత పదార్థాలను తొలగించుకోవాలంటే పండ్లను ముందుగా నీటిలో నానబెట్టాలి. నానబెట్టకుండా తినడం వల్ల ముఖం, శరీరంపై మొటిమలు, గడ్డలు వంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా కడుపులో వేడిని పెంచుతుంది, మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్ , ఇతర జీర్ణశయాంతర సమస్యలకు దారితీస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే మామిడిని తినడానికి ముందు నీటిలో నానబెట్టడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి.

మామిడి పండ్లను తినే ముందు నీళ్లలో ఎందుకు నానబెట్టాలి?

1. ఫైటిక్ యాసిడ్ విడుదల అవుతుంది ; మామిడి పండ్లలో సహజంగా లభించే ఫైటిక్ యాసిడ్ అనే పదార్ధం ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియంట్‌గా పరిగణించబడుతుంది. ఫైటిక్ యాసిడ్కా ల్షియం, ఐరన్ మరియు జింక్ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. ఇది శరీరంలో ఖనిజ లోపానికి దారితీస్తుంది. ఈ సందర్భంలో, మామిడిపండ్లను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

READ ALSO : గుండెపోటు, క్యాన్సర్ కణాలతో పోరాడే మామిడి పండు

2. పురుగుమందులను తొలగించటానికి సహాయపడుతుంది ; మామిడిపండ్లపై అనేక రకాల పురుగుమందులు ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కలిగిస్తాయి. తలనొప్పి, మలబద్ధకం ఇతర సమస్యలు వంటివి కలుగుజేస్తాయి. ఇవి చాలా హానికరమైనవి. చర్మం, కళ్ళు, శ్వాసకోశానికి చికాకు కలిగిస్తాయి. అలాగే అలెర్జీలను ప్రేరేపిస్తాయి. అందుకే వీటన్నింటికి దూరంగా ఉండాలంటే మామిడికాయలను తినటానికి గంట ముందుగా నీళ్లలో నానబెట్టి ఉంచాలి.

3. మామిడి కాయలోని వేడిని తగ్గిస్తుంది ; మామిడిని నీటిలో నానబెట్టి ఉంచడం వల్ల దానిలోని వేడిని తగ్గిస్తుంది. ఇలా చేయకుండా తింటే ముఖంపై మొటిమలు, చర్మంపై గడ్డలు రావచ్చు. అంతేకాకుండా వికారం, వాంతులు సమస్య తలెత్తుతుంది. మామిడికాయల వేడిని తగ్గించడానికి, తినడానికి ముందు వాటిని కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టి ఉంచాలి.

READ ALSO : మామిడి ఆకులతో అనేక ప్రయోజనాలు!

ఇలా చేయడం వలన మామిడి నుండి అన్ని హానికరమైన పదార్థాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. మామిడి పండ్లను తినడం వల్ల కలిగే అన్ని నష్టాలను నివారించాలనుకుంటే, వాటిని తినడానికి ముందు వాటిని నీటిలో నానబెట్టటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.