Mango Packing House : మామిడి ప్యాకింగ్ హౌస్ కి ఏపి ప్రభుత్వ సబ్సిడీ

దేశ విదేశాలకు ఎగుమతి చేసుకుంటే అధిక లాభాలను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఇందుకోసం గ్రేడింగ్, ప్యాకించే చేయాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్ హౌస్ లను ఏర్పాటు చేసింది.

Mango Packing House : మామిడి ప్యాకింగ్ హౌస్ కి ఏపి ప్రభుత్వ సబ్సిడీ

Mango Packing

Mango Packing House : తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఇప్పుడిప్పుడే మామిడి కోతలు ప్రారంభమవుతున్నాయి. అయితే పండ్లకు అధిక ధర రావాలంటే గ్రేడింగ్ చేసి అమ్ముకోవాలి.  ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్నపని కాబట్టి, ఆంద్రప్రదేశ్ ఉద్యానశాఖ ఇప్పుడు ప్యాకింగ్ హౌస్ నిర్మాణానికి 50 శాతం సబ్సిడితో అందిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు ఉధ్యాన అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు.

READ ALSO : Soak Mango : మామిడికాయను తినే ముందు నీటిలో నానబెట్టడం అవసరమా? దాని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే ?

వేసవి వచ్చిదంటే చాలు మామిడి సందడి మొదలవుతుంది. మార్కెట్‌లో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు , వాతావరణ మార్పుల కారణంగా.. మామిడి పూత ఆలస్యంగా వచ్చింది . నవంబర్‌లో రావాల్సిన పూత.. మార్చి నెలలో రావడం.. వచ్చిన పూత నిలవలేదు. దీంతో ఈ ఏడాది మామిడి పండ్ల దిగుబడి 10 శాతం కూడా లేదు. మార్కెట్ లో మంచి ధర పలికే అవకాశం ఉంది.

అంతే కాదు.. దేశ విదేశాలకు ఎగుమతి చేసుకుంటే అధిక లాభాలను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఇందుకోసం గ్రేడింగ్, ప్యాకించే చేయాల్సి ఉంటుంది. ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్ హౌస్ లను ఏర్పాటు చేసింది.

READ ALSO : Air Vistara : విమానంలో మామిడిపండ్లు పోగొట్టుకున్నాడు.. ఎయిర్లైన్ సిబ్బంది ఏం చేశారంటే?

ఆసక్తి ఉన్న రైతులకు ప్యాకింగ్ హౌస్ నిర్మాణం చేసుకోవచ్చని ఉద్యానశాఖ తెలియజేస్తుంది. ఇందుకోసం 50 శాతం సబ్సిడీని కూడా అందిస్తోంది. రైతులు గ్రూప్ గా ఏర్పడితే 75 శాతం అందించనున్నట్లు, ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలం ఉద్యానశాఖ అధికారి తెలియజేస్తున్నారు.