Trichoderma Viride : ట్రైకోడెర్మా విరిడి తయారీతో.. తెగుళ్ళకు చెక్

Trichoderma Viride : ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంద్ర నాశిని. పంటలకు శిలీం ద్రాలను ఆశించి, నిర్మూలిస్తుంది.

Trichoderma Viride

Trichoderma Viride : పంటల్లో రోజురోజు తెగుళ్ల బెడద ఎక్కువైపోతుంది. వీటినుండి పంటను కాపాడుకునేందుకు రైతులు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. అయినా అరికట్టలేకపోతున్నారు . ఈ నేపధ్యంలో అతితక్కువ ఖర్చుతో రైతే స్వయంగా తయారుచేసుకునే ట్రైకోడెర్మావిరిడి కల్చర పట్ల అవగాహన కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం విభాగం వారు.

సంప్రదాయ బద్దంగా పండిస్తున్న అనేక పంటలకు  సాగు మోదటి దశలోనే అనేక మైన తెగుల్లు సోకుతున్నాయి .. ముఖ్యంగా వేరుశనగ, పప్పుధాన్యాలు, కూరగాయలు, పత్తి, నిమ్మ, కొబ్బరి, అరటి, పొగాకు, మిరప లాంటి పంటలకు తీవ్రంగా నష్టం కలిగించే వేరుకుళ్లు, కాండం కుళ్లు, మాగుడు తెగులు, ఎండుతెగులు వంటివి సోకి రైతులను పూర్తిగా నష్టాల ఊభిలోకి తోసేస్తున్నాయి .. పోనీ .. రసాయిన ఏరువులు వాడుదామంటే … వాటి ధరలు కోండేక్కి కూర్చుంటున్నాయి.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

ఏరువులకే సాగులో సగం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ నేపధ్యంలో తెగుళ్ల సమస్యను అరికడుతూ.. రైతుల కష్టాలను తీర్చడంతో పాటు.. భూ సారం సైతం పెంచేందుకు నడుంబింగించారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకృతి వ్యవసాయ విభాగం వారు. ఇందులో భాగంగానే  ట్రైకోడెర్మావిరిడిని వినియోగించేలా శ్రీకాకుళం జిల్లా, గార మండలం, ఆరంగిపేట గ్రామంలో రైతులకు అవగాహణ కల్పిస్తున్నారు.

100 కేజిల పశువుల ఎరువుకు  2 కేలోల ట్రైకోడెర్మావిరిడి ని కలిపి  దానిని వారం రోజుల పాటుపక్కన పెడితే సేంద్రియ ఎరువు తయారవుతోంది. ఇది మొక్కలకు వాడినప్పుడు వేరు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది విత్తనశుద్ధి చేయడానికి, సేంద్రియ ఎరువులతో కలిపి నేలలో వేయడానికి పనికి వస్తుంది. పంటలకు తీవ్రంగా నష్టం కలిగించే వేరుకుళ్లు, కాండం కుళ్లు, మాగుడు తెగులు, ఎండుతెగులు నివారణకు ఇది ఉపయోగపడుతుంది. అతి తక్కువ ఖర్చుతో, సొంతంగా తయారు చేసుకుంటున్నట్లు రైతులు తెలుపుతున్నారు.

ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంద్ర నాశిని. ఇది పంటలకు హాని కలిగించే శిలీం ద్రాలను ఆశించి, నిర్మూలిస్తుంది. వివిధ పంటల్లో శిలీంధ్రపు తెగుళ్లైన ఎండు తెగులు, వేరుకుళ్లు తెగుళ్లను సమర్ధవంతంగా అరికట్టటానికి ట్రైకోడెర్మావిరిడి జీవ శిలీంధ్రం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఫంగస్ ఆధారిత జీవరసాయనం. తెల్లటి పొడి రూపంలో మార్కెట్లో వివిధ పేర్లతో రైతులకు అందుబాటులోవుంది. దీన్ని పశువుల ఎరువులో కలిపి భూమిలో తేమ వున్నప్పుడు దుక్కిలో వెదజల్లితే భూమి ద్వారా వ్యాప్తిచేందే శిలీంద్రపు తెగుళ్లను నాశనంచేస్తుంది.

బత్తాయి, నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటల్లో ప్రధాన సమస్యగా వున్న వేరుకుళ్లు, మొదలుకుళ్లు వంటి తెగుళ్లను ట్రైకోడెర్మా విరిడిని వాడి సమర్ధవంతంగా అరికట్టవచ్చు. పప్పుజాతి పంటలు, పత్తి వంటి పంటల్లో ట్రైకోడెర్మాతో విత్తనశుద్ధి చేస్తే,  విత్తనం ద్వారా వ్యాపించే శిలీంద్రాలను సమర్ధంగా అరికట్టవచ్చు.శిలీంధ్రపు తెగుళ్లు  ప్రధాన సమస్యగా వున్న భూముల్లో ముందుగా ట్రైకోడెర్మావిరిడిని పశువుల ఎరువులో వృద్ధిచేసి తేమ వున్నప్పుడు ఆఖరిదుక్కిలో వేసినట్లైతే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు