Sesame Cultivation : వేసవి నువ్వుకు చీడపీడలు ఆశించే అవకాశం.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Sesame Cultivation : ఈ ఏడాది ఏర్పడ్డ అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్తర తెలంగాణా జిల్లాలతో పాటు ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాలలో వేసవి నువ్వును రైతులు  విత్తుకున్నారు.

Preventive Measures to cultivation of summer sesame pests

Sesame Cultivation : నూనెగింజల పంటల్లో నువ్వు ప్రాధాన్యతే వేరు. దీనిలో నూనె 46 నుంచి 55శాతం వరకు, ప్రోటీన్లు 20 నుంచి 25 శాతం వరకు ఉంటాయి. తక్కువ పెట్టుబడులతో అధిక నికర లాభాన్ని ఆర్జించే పంటగా నువ్వు  రైతుల ఆదరణ పొందుతోంది. అయితే వేసవిలో విత్తిన పైరులో చీడపీడల ఉధృతి అధికంగా కన్పిస్తోంది. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశాలు ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు ఎలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త హసీనా భాను.

Read Also : Mirchi Cultivation : మిరపను ఆశించే పూత పురుగు నివారణ

అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని సాగయ్యే నూనెగింజల పంటల్లో నువ్వు ప్రధానమైనది. ఈ ఏడాది ఏర్పడ్డ అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్తర తెలంగాణా జిల్లాలతో పాటు ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాలలో వేసవి నువ్వును రైతులు  విత్తుకున్నారు.

కొన్ని ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. విత్తిన ప్రాంతాలలో వివిధ దశల్లో ఉంది. అయితే ఈ సమయంలో చీడపీడల బెడద కూడా అధికంగానే ఉంటుంది. సకాలంలో వాటిని గుర్తించి నివారిస్తేనే మంచి దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. అయితే ఏ తెగులుకు ఏ మందులు పిచికారి చేసి నివారించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా,  ఎలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త హసీనా భాను.

Read Also : Coconut Plantation : కొబ్బరి తోటలో అంతర పంటలతో అదనపు ఆదాయం పొందుతున్న రైతు

ట్రెండింగ్ వార్తలు