Coconut Plantation : కొబ్బరి తోటలో అంతర పంటలతో అదనపు ఆదాయం పొందుతున్న రైతు

Coconut Plantation : ప్రకృతి వైపరీత్యాల వంటి వాటితో తీవ్రంగా నష్టపోతున్న రైతులను అంతర పంటలు ఆర్ధికంగా ఆదుకుంటున్నాయి.  ఏ పంట వేస్తే లాభాలు ఆర్జించవచ్చో, ఎప్పుడు వేస్తే మంచి దిగుబడి పొందవచ్చో రైతు శ్రధర్ బాగా ఒంటపట్టించుకున్నారు. 

Coconut Plantation : కొబ్బరి తోటలో అంతర పంటలతో అదనపు ఆదాయం పొందుతున్న రైతు

Coconut Plantation

Coconut Plantation : రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ.. ఆర్థిక భరోసాను అందిస్తాయి అంతర పంటలు. ఒకే పంటపై ఆధారపడితే అంతగా ఆదాయం రాదు. ముఖ్యంగా కొబ్బరి లాంటి పంటలైతే  ఫలసాయం పొందాలంటే 5 ఏళ్ల పాటు ఆగాల్సి వస్తుంది. అందుకే చాలా మంది తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలను అంతర పంటలుగా సాగుచేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు కొబ్బరి తోటలో కూరగాయలతో పాటు మినుముని అంతర పంటలుగా సాగుచేస్తూ.. మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు.

Read Also : Corn Cultivation Tips : మొక్కజొన్న నిల్వల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పుడమితల్లిని నమ్ముకుని సాగుచేయడమే ఈ రైతులకు నిన్నటి వరకు తెలుసు. కానీ ఇటీవల అంతర పంట సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు సాధిస్తూ.. నాలుగు కాసులు వెనకేసుకుంటున్నారు. అంతర పంటలు సాగుచేయాలంటే ఈ రైతే చేయాలనే రీతిలో ముందుకు సాగుతున్నారు.. పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం మండలం, జగ్గన్నపేట గ్రామానికి చెందిన రైతు గొర్రెల శ్రీధర్. కొబ్బరిలో కూరగాయలు, మినుములు పండిస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

కొబ్బరిలో దోస, సొర, మినుము పంటల సాగు : 
వాణిజ్య పంటల దిగుబడి అందే సమయంలో మార్కెట్ లో గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాల వంటి వాటితో తీవ్రంగా నష్టపోతున్న రైతులను అంతర పంటలు ఆర్ధికంగా ఆదుకుంటున్నాయి.  ఏ పంట వేస్తే లాభాలు ఆర్జించవచ్చో, ఎప్పుడు వేస్తే మంచి దిగుబడి పొందవచ్చో రైతు శ్రధర్ బాగా ఒంటపట్టించుకున్నారు.  అందుకే తన మూడున్నర ఎకరాల కొబ్బరితోటలో ప్రతి సీజన్ లో అంతర పంటలు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతుంటారు. ప్రస్తుతం సొర, దోసతో పాటు మినుము సాగుచేశారు. మరికొద్దిరోజుల్లో మినుము పంట చేతికి రానుండగా.. ఇప్పుడిప్పుడే పూత, కాత దశలో సొర, దోస పంటలున్నాయి.

వాణిజ్య పంటలకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉండగా, అంతర పంటలకు స్వల్పంగా పెట్టుబడి పెడితే నిత్యం అధికంగా ఆదాయం లభిస్తోంది. దీనిని వాణిజ్య పంటలకు వినయోగించడంతో ఆర్థిక భారాన్ని తగ్గిచుకోవచ్చు. అంతే కాదు అంతర పంటలతో కలుపును నివారించుకునే అవకాశం ఉంది. ప్రధాన పంటకు నుండి దిగుబడి పొందాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే అంతర పంటలతో అదనపు ఆదాయం పొందుతున్న ఈ అభ్యుదయ రైతుకు కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి అక్షరాలా సరిపోతుంది.

Farmer Success Story

Read Also : Sugarcane Cultivation : చెరకు కార్శితోటల యాజమాన్యం.. సాగుతో సమయం, పెట్టుబడి ఆదా