Green Malta farming : బత్తాయి సాగులో యాజమాన్య పద్ధతులు !

చిన్న మొక్కలకు ఎండ కాలంలో తరుచుగా నీరు కట్టుకోవాలి. చెట్టుకు ఎంత నీరు కట్టాలి అనేది నేల , వాతావరణం , చెట్ల వయస్సు , దిగుబడుల పైన ఆధారపడి ఉంటుంది. చెట్టు పూత, పిందెలపై ఉన్నపుడు క్రమం తప్పక నీరు పెట్టుకోవాలి.

Green Malta farming : నీటి ఆధారం కలిగి, గట్టి ఈదురు గాలులు లేని ప్రాంతాలు బత్తాయి సాగుకు అనుకూలంగా ఉంటుంది . సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తు వరకు కూడా సాగుచేయవచ్చు. నేలలోని ఉదజిని సూచిక 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. నీరు నిలువని లోతైన ఎర్ర గరప నేలలు శ్రేష్టమైనవి . తేలికపాటి నల్లభూములు కూడా అనుకూలంగా ఉంటాయి.

చీనీలో రంగపూర్ నిమ్మపై కట్టిన వైరస్ తెగుళ్ళులేని అంట్లను, నిమ్మలో మొలకలు లేదా గజ నిమ్మలో రంగపూర్ నిమ్మకట్టిన అంట్లను ఎన్నుకొని సాగు చేసుకోవాలి. వేరు మూలంపై 15 సెం.మీ. ఎత్తులో కట్టిన అంట్లను ఎంపిక చేసుకోవాలి. అంటు కట్టిన తరువాత 6-10 నెలల వయస్సుగల అంట్లను ఎన్నుకోవాలి. మొజాయిక్, గ్రీనింగ్ , ట్రిస్టిజా మొదలైన వెర్రితెకుళ్ళు లేని అంట్లను ఎన్నుకోవాలి. కణుపుల మధ్య దూరం దగ్గరగా ఉండి , ఆకుల పరిమాణం మధ్యస్థంగా ఉన్న అంట్లు నాణ్యమైనవిగా చెప్పవచ్చు.

READ ALSO : Irrigation Management : మొక్కజొన్నలో రైతులు అనుసరించాల్సిన నీటి యాజమాన్య పద్ధతులు !

చీనీ , నిమ్మ మొక్కలను 6 x 6 మీటర్ల దూరంలో నాటాలి. సారవంతమైన నేలల్లో 8 x 8 మీ. దూరంలోనూ నాటుకోవచ్చు . మొక్కలను నాటడానికి ఒక నెల రోజుల ముందే 1 x 1 x 1 మీటరు పరిమాణం గల4 గుంతలను తవ్వుకోవాలి . ప్రతి గుంతలోనూ  మట్టితో పాటు 40 కిలోల పశువుల ఎరువు , ఒక కిలో సూపర్ ఫాస్ఫేటు , 100 గ్రా 10% లిండెన్ పొడివేసి కలిపి నింపాలి. సాత్ గుడి , బటావియన్  , మొసంబి వంటి రకాలను  సాగుకు ఎంపిక  చేసుకోవాలి.

చిన్న మొక్కలకు ఎండ కాలంలో తరుచుగా నీరు కట్టుకోవాలి. చెట్టుకు ఎంత నీరు కట్టాలి అనేది నేల , వాతావరణం , చెట్ల వయస్సు , దిగుబడుల పైన ఆధారపడి ఉంటుంది. చెట్టు పూత, పిందెలపై ఉన్నపుడు క్రమం తప్పక నీరు పెట్టుకోవాలి. నీటి ఎద్దడి ప్రాంతాల్లోని చెట్ల పాదుల్లో ఎండాకులు , వరి పొట్టు, లేదా వేరుశనగ పొట్టు 8 సెం.మీ. మందంలో వేసి తేమ ఆవిరై పోకుండా కాపాడు కోవచ్చు.

READ ALSO : Pomegranate Cultivation : దానిమ్మ సాగులో కొమ్మ కత్తిరింపులు, పూత,నియంత్రణలో యాజమాన్యం!

కాపు రాక ముందు రెండు, మూడు సంవత్సరాల వరకు అంతర పంటలుగా వేరుశనగ, అపరాలు , బంతి , దోస , ఉల్లి , పుచ్చ వేయవచ్చు . మిరప, టొమోటో , వంగ , పొగాకు పైర్లను వేయకూడదు. ఈ పైర్లను వేయటం వలన నులి పురుగుల బెడద అధికమౌతుంది.

వర్షాకాలంలో జనుము , అలసంద , పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత సమయంలో పాదిలో మరియు భూమిలో వేసి కలియ దున్నాలి.పాదులు గట్టిపడకుండా అప్పుడప్పుడు త్రవ్వాలి . పాదులు త్రవ్వేటపుడు , ఎరువులు వేసేటపుడు వేర్లు ఎక్కువ తెగకుండా తేలికపాటి సేద్యం చేయాలి. మామిడిలో తెలిపిన కలుపు నివారణ చర్యల ద్వారా చీనీ, నిమ్మలలో కలుపును నివారించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు