Ragi Varieties Suitable : ఖరీఫ్‌కు అనువైన రాగి రకాలు – అధిక దిగుబడులకు మేలైన యాజమన్య పద్ధతులు 

Ragi Varieties Suitable : చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఖరీఫ్ పంటగా జులై నుండి ఆగస్టు చివరి వరకు విత్తుకోవచ్చు. 

Ragi Varieties Suitable : ఖరీఫ్‌కు అనువైన రాగి రకాలు – అధిక దిగుబడులకు మేలైన యాజమన్య పద్ధతులు 

Ragi Varieties Suitable for Kharif

Ragi Varieties Suitable : నానాటికీ ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహణతో చిరుధాన్యాల వాడకం మళ్ళీ ఊపందుకుంది. ముఖ్యంగా ఒకప్పుడు చిన్నచూపకు గురైన జొన్నలు, కొర్రలు, రాగుల సాగు  ఇప్పుడు లాభదాయకంగా మారింది. అందుకు తగ్గట్లుగానే వీటిలో ప్రస్తుతం అధిక దిగుబడులనిచ్చేఎన్నో నూతన రకాలు అందుబాటులోకి వచ్చాయి.

చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఖరీఫ్ పంటగా జులై నుండి ఆగస్టు చివరి వరకు విత్తుకోవచ్చు.  అయితే ఈ పంటలో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు,  సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.  ఉమామహేశ్వరరావు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ప్రధాన ఆహారమైన జొన్నలు, కొర్రలు, రాగులు.. కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల వల్ల సాగు విస్థీర్ణం తగ్గిపోయింది. అయితే ఇందులోని పోషకవిలువలను గుర్తెరిగాక చిరుధాన్యాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో పండించే చిరుధాన్యాల్లో చోడి ముఖ్యమైనది. దీన్నే రాగి, తైదలుగా కూడా పిలుస్తుంటారు. రాగిలో పీచుపధార్ధం అధికంగా వుండటం, వరి గోధుమ కంటే  పోషకాల శాతం అధికంగా వుండటంతో… ఇటీవలికాలంలో మంచి పౌష్టికాహారంగా రాగి, అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోంది.

రాగిని ఖరీఫ్ లో జూలై నుంచి ఆగష్టు వరకు, రబీలో నవంబరు మాసాల్లో సాగుచేస్తారు. వేసవి పంటగా కూడా సాగుచేయవచ్చు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలు ఎకరానికి 16 నుండి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నాయి. దీంతో రైతులు రాగిని సాగుచేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. ఉమామహేశ్వరరావు.

రాగిని నేరుగా విత్తే విధానంలోను లేదా నారును పెంచి నాటుకోవటం ద్వారా సాగుచేయవచ్చు. ఏ విధానమైన ఎకరాకు 3 నుంచి 4కిలోల విత్తనం సరిపోతుంది. అయితే తప్పకుండా విత్తన శుద్ధిని చేయాలి. దీంతో పాటు సమయానుకూలంగా ఎరువులు, నీటి తడులను అందించినట్లైతే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు