Vietnam Murrel Fish Farming : వియత్నం కొరమేను పెంపకంలో.. లాభాలు గడిస్తున్న రాజేశ్వరి

వేముల కొండ గ్రామంలో ఎకరం భూమిని లీజుకు తీసుకొని.. అందులో చెరువును తవ్వించి వియత్నం కొరమేను పిల్లను పెంచుతోంది. సమయానికి అనుకూలంగా దాణా వేస్తూ.. ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తోంది. అందుకే చేపపిల్లల మరణాలు జరగలేదు. అంతే కాదు జనవరి 31 వరకే ఒక్కోచేప బరువు 1 కిలోకు చేరుకుంది.

Vietnam Murrel Fish Farming : మహిళలంటే ఒకప్పుడు ఇంటి పనికి.. వంటపనికే పరిమితం అన్నమాట మరుగునపడిపోయి చాన్నాళ్లవుతుంది. ఇప్పుడు చాలామంది అతివలు పలు రంగాల్లో రాణిస్తున్నారు. అయితే కేవలం ఏసీ రూముల్లో ఆపీస్ లకే కాదు.. మగవారితో ధీటుగా ఎంతో కష్టంగా ఉండే పనుల్లోనూ సత్తా చాటుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మార్పులకనుగుణంగా వివిధ రంగాలపై అవగాహన పెంచుకొని.. పట్టుదలతో విజయాలు సాదిస్తున్నారు. అలాంటి ఓ మహిళే రాజేశ్వరి. ఎంతో కష్టంతో కూడి కొరమేను సాగులో తొలిసారిగా అడుగుపెట్టి.. అనుభజ్ణుల సలహాలను పాటిస్తూ.. తొలి ప్రయత్నంలోనే మంచి ఫలితాలు సాదించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఆవిడ అనుభవాలేంటో వారి ద్వారానే తెలుసుకుందాం…

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

చేపల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన వృద్ధిరేటు నమోదుచేస్తోంది. ఏటా చేపల వినియోగం పెరగుతుండటం, ధర కూడా ఆశాజనకంగా వుండటంతో ఈ పరిశ్రమ ఆర్ధికంగా రైతుకు వెన్నుదన్నుగా వుంది.  అయితే తెల్ల చేపల పెంపకం కంటే నల్లచేపలైన కొరమేను పెంపకంలో లాభాలు అధికంగా ఉంటాయి. రిస్క్ కూడా అలాగే ఉంటుంది. సరైన శిక్షణ లేకుండా వీటి పెంపకం అంత సాధ్యం కాదు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వేములకొండ గ్రామానికి చెందిన మహిళా రైతు రాజేశ్వరి పలు వీటిని పెంచుతూ.. లాభాలు ఆర్జించేందుకు సిద్ధమవుతున్నారు..

రాజేశ్వరిది ఖమ్మం జిల్లా, ఇల్లెందు. ఈమె సెటిల్ అయ్యింది మాత్రం హైదరాబాద్ లో. అయితే కరోనా ఎఫెక్ట్ తనూ నిర్వహిస్తున్న పేపర్ ప్లేట్ తయారీ పై పడింది. దీంతో వేరే బిజినెస్ చేయాలనుకుంది. ఇందుకోసం పలు రంగాలను పరిశీలించగా.. కొరమేను చేపల పెంపకం ఆకర్షించింది. వీటిని పెంచేరైతు చెరువుల వద్దకు వెళ్లి, వాటి పెపంకం గురించి, లాభ నష్టాలను తెలుసుకుంది.

READ ALSO :  Polyculture System : పాలీకల్చర్ విధానంలో రొయ్యలు, చేపల పెంపకం

వేముల కొండ గ్రామంలో ఎకరం భూమిని లీజుకు తీసుకొని.. అందులో చెరువును తవ్వించి వియత్నం కొరమేను పిల్లను పెంచుతోంది. సమయానికి అనుకూలంగా దాణా వేస్తూ.. ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తోంది. అందుకే చేపపిల్లల మరణాలు జరగలేదు. అంతే కాదు జనవరి 31 వరకే ఒక్కోచేప బరువు 1 కిలోకు చేరుకుంది. మరో వారం రోజుల్లో పట్టుడి చేయనున్న రాజేశ్వరీ.. మాంచి లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రాజేశ్వరి పెట్టిన పెట్టుబడి అక్షరాల 10 లక్షలు. అయితే మరణాల సంఖ్య లేకపోవడం.. ఒక్కో చేప కిలో పైనే బరువు పెరగడం చూస్తుంటే.. తక్కువలో తక్కువ ఎనిమిదున్నర టన్నుల దిగుబడి వస్తుంది. అయితే ఇప్పటికే ఫ్రెష్ టూ హోం తో పాటు మరో వ్యాపారికి కిలో ధర రూ. 300 చొప్పున ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఎనిమిదున్నర టన్నులకు దాదాపు 25 లక్షల ఆదాయం వస్తుందన్నమాట. పెట్టిన పెట్టుడి మొదటి ఏడాదే.. చేతికి రావడమే కాకుండా 15 లక్షల నికర ఆదాయం కూడా పొందనున్నారు. వచ్చే ఏడాది నుండి చెరువు తవ్వకం, నెట్, మోటర్లకు పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు కాబట్టి.. అధిక లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ లాభాలు పొందాలంటే ఇతరులపై ఆదారపడకుండా సొంతంగా చేసుకోవాలని రాజేశ్వరి అనుభవం తెలియజేస్తుంది.

READ ALSO : Fish Farming : వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ట్రెండింగ్ వార్తలు