Polyculture System : పాలీకల్చర్ విధానంలో రొయ్యలు, చేపల పెంపకం

4 ఎకరాల్లో, 6 ఎళ్లుగా పాలీకల్చర్ విధానంలో చేపల పెంపకం చేస్తున్నారు రైతు నరసింహ స్వామి. ఎకరాకు 50 వేల నుండి 1 లక్ష వరకు రొయ్యపిల్లలు వేస్తున్నారు. పలు రకాల తెల్ల చేపలు 1500 వేస్తున్నారు. అయితే 50 కౌంట్ రొయ్య దిగుబడి 5 క్వింటాలు వస్తుంది.

Polyculture System : పాలీకల్చర్ విధానంలో రొయ్యలు, చేపల పెంపకం

Polyculture System

Polyculture System : నేలతల్లిని నమ్ముకుని ఏళ్ల తరబడి నష్టాలను చవిచూసిన అన్నదాత , వ్యవసాయాన్ని వదల లేక, ఆక్వా రంగం వైపు వెళ్లారు. అక్కడా ఏదో ఒక అవాంతరం… రొయ్యల కౌంట్లు, వాటి లెక్కలు… బాగుంటే లాభమే.. పిల్లలు ఎదిగీ ఎదగక.. చనిపోయి.. వైరస్ వ్యాపించి తేడా వస్తే, ఇక తేరుకునేది ఉండదన్నది, అందులో తలపండినవారు చెప్పే మాట. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు కొంతమంది రైతులు.. ఉత్తమ లాభదాయకమైన మార్గం.. పాలికల్చర్ విధానాన్ని, ఎంచుకుంటున్నారు.

READ ALSO : Shrimp Cultivation : రొయ్యలకు వైరస్ ల ముప్పు.. సమయానుకూలంగా చేపట్టాల్సిన జాగ్రత్తలు

వనామి సాగుతో నష్టాలను మూటకట్టుకున్న రైతులకు, పాలీకల్చర్ కొండంత ఆసరాగా నిలుస్తోంది. ఒకే చెరువులో తెల్ల చేపలు, రొయ్యల పెంపకం చేపట్టడమే ఈ కలర్చర్ విధానం. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు కొన్నేళ్లుగా, పాలీకల్చర్ విధానంలో చేపల పెంపకం చేపట్టి, నికరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. పాలీకల్చర్ అంటే రొయ్యలు, తెల్ల చేపలను కలిపి పెంచడం. ముఖ్యంగా ఈ విధానంలో రొయ్యలకు వచ్చే వైరస్ లను చేపల అరికడుతుంటాయి. ఒకే చెరువులో 4 పంటలగా రొయ్యలు, 2 పంటలుగా చేపలు దిగుబడి పొందవచ్చు.

READ ALSO : Fish Farming : వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ విధానాన్నే ఆచరిస్తున్నాడు, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలం, గొల్లవాని తిప్ప గ్రామానికి చెందిన పెనుమాళ్ల నర్సింహ స్వామి. గతంలో కేవలం వనామి సాగుచేసిన ఈ రైతు, తీవ్రనష్టాలను చవిచూశారు. అయితే పాలీకల్చర్ విధానంలో పిక్స్ డ్ ఆదాయం ఉండటంతో ఈ సాగు విధానం చేపట్టారు. అంతే కాదు రొయ్యలకు, చేపలకు ఒకే మేత వేయడం  వేయడంవల్ల ఖర్చు కూడా తగ్గించుకుంటున్నారు.

READ ALSO : Organic Prawn Farming : ఆర్గానిక్ పద్ధతిలో రోయ్యల సాగు

4 ఎకరాల్లో, 6 ఎళ్లుగా పాలీకల్చర్ విధానంలో చేపల పెంపకం చేస్తున్నారు రైతు నరసింహ స్వామి. ఎకరాకు 50 వేల నుండి 1 లక్ష వరకు రొయ్యపిల్లలు వేస్తున్నారు. పలు రకాల తెల్ల చేపలు 1500 వేస్తున్నారు. అయితే 50 కౌంట్ రొయ్య దిగుబడి 5 క్వింటాలు వస్తుంది. మార్కెట్ లో కింటాలు ధర రూ. 35 వేలు నడుస్తుంది. అంటే 5 క్వింటాలకు  1 లక్షా 75 వేల ఆదాయం వస్తుంది. మరో వైపు 6 నెల్లో చేపల దిగుబడి 1200 కిలోలు వచ్చినా, మార్కెట్ లో  హోల్ సేల్ గా , కిలో ధర రూ. 95 పలుకుతోంది. అంటే చేపలపై ఆదాయం రూ. 1 లక్షా 14 వేల ఆదాయం వస్తోంది అన్నమాట.

READ ALSO : Crab Farming : పీతల పెంపకంలో కొత్త విధానం.. మంచి లాభాలు ఆర్జిస్తున్న రైతులు

చేపల పై వచ్చే ఆదాయాన్ని పెట్టుబడిగా పోగా.. రొయ్యలపై వచ్చేది నికర ఆదాయం అన్నమాట. ఎకరాకు ఒక్కో పంటపై అన్ని ఖర్చులు పోను  1 లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు రైతు. అంటే 4 ఎకరాల్లో 4 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారన్నమాట. రొయ్య 50 కౌంట్  రావడానికి 2 నెలల సమయం పడుతుంది. అంటే ఏడాదికి 4 పంటలు సాగుచేస్తున్న రైతు. ఎకరాకు రూ. 4 లక్షల ఆదాయం పొందుతున్నారు. 4 ఎకరాలలో ఏడాదికి 16 లక్షల ఆదాయం వస్తోంది. కరెక్ట్ గా ప్రణాళిక చేసుంకుంటే, రైతు ఇంతకంటే ఇంకేం కావాలి.