Rice Varieties : ఖరీఫ్‎కు అనువైన దీర్ఘకాలిక సన్న వరి రకాలు

Rice Varieties : చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో వుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి.

Rice Varieties : ఖరీఫ్‎కు అనువైన దీర్ఘకాలిక సన్న వరి రకాలు

Rice Varieties Suitable for Kharif in Telugu

Updated On : June 28, 2024 / 2:20 PM IST

Rice Varieties : ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. రైతులు వరి రకాలను ఎంచుకుని, విత్తనాలు సమకూర్చుకునే  పనిలో ఉన్నారు. దీర్ఘకాలిక రకాలను వేసుకొనే రైతులు ఇప్పటికే నార్లు పోస్తున్నారు. ఇంకా పోయని రైతులు దీర్థకాలిక సన్న రకాలను సాగుచేయాలంటే.. ఏ రకాలను ఎంచుకోవాలి.. ఎప్పటి వరకు నారుమడులు పోసుకోవాలో తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

10 ఏళ్లలో వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో వుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే.

మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి వరిసాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ.. ఖరీఫ్ కు అనువైన దీర్ఘకాలిక సన్న వరి రకాల గురించి తెలియజేస్తున్నారుప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శాస్త్రవేత్త సతీష్ చంద్ర.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు