Yasangi Crops : యాసంగి పంటల్లో విత్తనశుద్ధి
Yasangi Crops : నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో.. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు.

Seeds Purification in Yasangi Crops
Yasangi Crops : మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా అన్ని రకాల పంటలకు చీడపీడలు సమస్య అధికమైంది. వీటిని నియంత్రించడానికి అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులు నాణ్యమైన విత్తనాలను సేకరించినప్పటికీ, విత్తడానికి ముందే విత్తనశుద్ధి చేయడం ద్వారా విత్తనం, నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు, పురుగులను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిరోధించవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు.
నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో.. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంద్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే.. విత్తనశుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం అధికంగా ఉండి, మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు.
విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి , తొలిదశలో పురుగులు, తెగుళ్ళను ఆరికట్టి , తర్వాత దశలో పిచికారి మందులు కూలీల పై పెట్టె ఖర్చును తగ్గించుకోడానికి తోడ్పడుతుంది. కాబట్టి యాసంగి పంటలను సాగుచేసే రైతులు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు జిగిత్యాల జిల్లా, పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, శాస్త్రవేత్త డా. బలరాం.
Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్లో వరిగట్లపై కూరగాయల సాగు