Shrigandham Plants : రైతులకు అందుబాటులో శ్రీగంధం మొక్కలు

శ్రీ గంధం మన సంస్కృతిలో భాగం. దీనిలోని అపార ఔషధ గుణాల వల్ల వైద్య రంగంలోను, వివిధ కాస్మోటిక్స్ తయారీలోను విరివిగా వాడుతున్నారు. గంధం మొక్కలు ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని, వాటి వేర్లనుంచి కొంతమేర పోషకాలను గ్రహించటం ద్వారా పెరుగుతాయి.

Shrigandham Plants

Shrigandham Plants : ఈ మధ్య కాలంలో.. తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘకాలిక కలప మొక్కల సాగు పెరుగుతోంది. సంప్రదాయ పంటల సాగుతో నష్టలను చవిచూస్తున్న రైతులు కలప సాగుపై ఆసక్తి చూపుతున్నారు. కలప చెట్లు పెరిగి రాబడి రావడం ఆలస్యమైనా, నస్టాలు రావనే అంచనాతో శ్రీగంధం మొక్కల పెంపకంవైపు మొగ్గుచూపుతున్నారు. నాటిన 15 ఏళ్ల తరువాత ఒక్కో మొక్కపై 2 లక్షల ఆదాయం వస్తుందనే ఆలోచనతో రైతులు .. వీటి సాగుకు ఆకర్షితులవుతున్నారు.

READ ALSO : Groundnut Cultivation :వేరుశనగ పంటకు చీడపీడల బెడద.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

అయితే ఎలాంటి మొక్కలను ఎంచుకోవాలి… అవి ఎక్కడ దొరుకుతాయి.. అనే సందేహాలు చాలా ఉన్నాయి. వారి కోసం తెలంగాణ ఉద్యాన శాఖ ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రయోగాత్మకంగా పెంపకం చేపడుతూ.. రైతులకు నాణ్యమైన నర్సరీ మొక్కలను అందిస్తోంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం…

ప్రపంచంలోకెల్లా ఖరీదైన వృక్షాలలో అతిముఖ్యమైనది శ్రీ గంధం . పూర్వం గంధపు చెట్లకోసం పూర్తిగా అడవులపై ఆధారపడే వాళ్లం. కానీ అడవుల నరికివేత, అక్రమ స్మగ్లింగ్ వల్ల గంధపుచెట్ల సంపద తరిగిపోతోంది. దీంతో వీటి డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచంలోని 196 దేశాల్లో కేవలం 8 దేశాల్లో మాత్రమే గంధం సాగుకు అనువైన వాతావరణం వుంది. వీటిలో మన దేశంకూడా వుండటం, అందులో దక్షిణాది రాష్ట్రాలు గంధం సాగుకు అత్యంత అనువుగా వున్నట్లు గుర్తించటం జరిగింది.

READ ALSO : Weed Control : వెద వరి సాగులో.. కలుపు నివారణ

ఈ చెట్టు బెరడు, మధ్యలోని చేవభాగం, చెట్టు వేర్లు ఇలా అన్నీ ఉపయోగపడే భాగాలే… శ్రీ గంధం మన సంస్కృతిలో భాగం. దీనిలోని అపార ఔషధ గుణాల వల్ల వైద్య రంగంలోను, వివిధ కాస్మోటిక్స్ తయారీలోను విరివిగా వాడుతున్నారు. గంధం మొక్కలు ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని, వాటి వేర్లనుంచి కొంతమేర పోషకాలను గ్రహించటం ద్వారా పెరుగుతాయి. అందువల్ల వీటిని పరాన్న భుక్కులుగా పిలుస్తారు.

ఈ చెట్లు 10 నుండి 12అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.  గతంలో పొలాల్లో, ఇంటి వద్ద, ఈ చెట్ల పెంపకానికి అనుమతిలేదు. కానీ  విలువైన ఈ వృక్ష సంపద అంతరించిపోతుండటంతో ఇప్పుడు కేంద్రప్రభుత్వం వీటి సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. మొక్కలు నాటేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. చెట్లు నరికేటప్పుడు మాత్రం అటవీశాఖ అనుమతి తప్పనిసరి.

READ ALSO : Sugarcane Cultivation : పక్వదశలో చెరకు తోటలు.. జడచుట్లతో కాపాడుకోవాలంటున్న శాస్త్రవేత్తలు 

క్రమపద్ధతిలో వరుసగా శ్రీగంధం మొక్కలు.. మధ్య మధ్యలో సర్వీ మొక్కలతో సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, ములుగు గ్రామంలో తెలంగాణ ఉద్యానశాఖ ఏర్పాటు చేసిన వ్యవసాయ క్షేత్రం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. రైతు సాగు చేసే పంటకు,  పెట్టుబడి, శ్రమ తక్కువగా ఉండాలి. సాగు చేస్తున్న పైరు దీర్ఘకాలికమైనది అయినప్పుడు, ఆ కాలంలో అంతరపంటల ద్వారా కొద్దిపాటి ఆదాయం రైతుకు అందించేదై ఉండాలి.

ప్రత్యేకంగా ఆ పైరుకు నీరు పారించటం, ఎరువులు వేయటం.. చీడ పీడ నివారణ చర్యలు చేపట్టడం.. అంతరకృషి అవసరం. కలుపు నిర్మూలన లాంటి ఖర్చులు లేకుండా ఉండాలి. అలాంటి పంటలు కొన్నింటిని రైతులకు అందుబాటులోకి తీసుకవచ్చేందుకు ప్రయత్రం చేసింది సిఓఈ . అందులో భాగంగానే కొంత విస్తీర్ణంలో శ్రీగంధంలో అంతర పంటగా సర్వీ మొక్కలను నాటి ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అంతే కాదు రైతులకు నాణ్యమైన నర్సరీ మొక్కలను తయారుచేసి తక్కువ ధరకే అందిస్తోంది.

READ ALSO : Pests in Cotton : పత్తిలో తొలిదశలో వచ్చే చీడపీడల నివారణ

రైతులను రాజుగా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతూ సబ్సిడీ అందిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. సంప్రదాయ పంటలతో ఆర్థికాభివృద్ధి జరగకపోగా రైతులు అప్పుల్లో కూరుకు పోతున్నారు. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను అడుగులు వేయాలని ఉద్యానవన శాఖ అధికారులు కోరుతున్నారు. అయితే నాణ్యమైన శ్రీగంధం మొక్కలు కావల్సిన రైతులు ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు.