Weed Control : వెద వరి సాగులో.. కలుపు నివారణ

వ్యవసాయ కూలీల కొరత ఎక్కువ అవుతోంది. ఒక వేళ కూలీలు లభించినప్పటికీ చిన్న, సన్నకారు రైతులు భరించలేని కూలీల రేట్లు పెను సమస్యగా మారాయి. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగి రైతుకు సాగు ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతున్నది.

Weed Control : వెద వరి సాగులో.. కలుపు నివారణ

Weed Control

Weed Control : వ్యవసాయంలో నానాటికి పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. అందుకే నూతన సాంకేతిక విధానాన్ని అందిపుచ్చుకుంటూ… సాగు ఖర్చులను తగ్గించుకొని.. లాభసాటి వ్యవసాయాన్ని చేసేందుకు రైతులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా వరి పంటలో కూలీల అవసరం ఎక్కువ. వీటిని తగ్గించే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.

READ ALSO : Sugarcane Cultivation : పక్వదశలో చెరకు తోటలు.. జడచుట్లతో కాపాడుకోవాలంటున్న శాస్త్రవేత్తలు 

అందులో నేరుగా పొడిదుక్కిలో విత్తనం వెదపెట్టడం.. మరోకటి దమ్ములో విత్తన వెదపెట్టడం. ఈ పద్ధతిలో కూలీల సమస్య తగ్గడమే కాకుండా.. పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. అయితే కలుపు సమస్య అధికంగా ఉంటుంది. దీనినే సకాలంలో నివారిస్తే.. అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు  ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, మహాలక్ష్మి.

READ ALSO : Cultivate Paddy : వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేయాలంటున్న శాస్త్రవేత్తలు

వ్యవసాయ కూలీల కొరత ఎక్కువ అవుతోంది. ఒక వేళ కూలీలు లభించినప్పటికీ చిన్న, సన్నకారు రైతులు భరించలేని కూలీల రేట్లు పెను సమస్యగా మారాయి. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగి రైతుకు సాగు ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతున్నది. నూతన విధానంలో సాగు ఖర్చును తగ్గించి వరి సాగును మరింత లాభదాయకంగా చేయడం అత్యంత అవసరం.

READ ALSO : Rice Cultivation : వరిలో అధిక దిగుబడులకోసం సమగ్ర యాజమాన్యం

ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు అధిక శ్రమతో కూడిన దమ్ము చేసి నాట్లు వేసే పద్ధతికి ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంభించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిలో భాగంగానే చాలా మంది రైతులు వరి నాట్లు వేసి పండించే సంప్రదాయ పద్ధతిని వదిలి.. విత్తనాలు నేరుగా పొడిదుక్కిలో, దమ్ము చేసిన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు.  దీంతో పంట కాలం , సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా..  మంచి దిగుబడులు సాధించి..  అధిక ఆదాయాన్ని పొందవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, మహాలక్ష్మి .