Gladiolus Flower Cultivation : గ్లాడియోలస్ పూలసాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

ఎరుపు, తెలుపు, నీలి వర్ణాలతో కనిపిస్తున్న ఈ గ్లాడియోలస్ ఫ్లవర్స్ ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి కదూ.. ఈ పూలను విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సాగుచేస్తున్నారు. 

Gladiolus Flower Cultivation

Gladiolus Flower Cultivation : కంటికి అందంగా, ఆకర్షణీయంగా ఉన్న ఎటువంటి పూలకైనా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. వీటిలో కూడా ఎక్కువ రోజులు నిల్వ వుండే పూలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్థుతం జర్బరా, కార్నేషన్ వంటి వివిధ కట్ ఫ్లవర్స్ కు అధిక డిమాండ్ ఉన్నా… శుభకార్యలు, పెద్ద పెద్ద ఫంక్షన్లలో సరికొత్త శోభనందించే ఫ్లవర్స్ ను ఇతర రాష్ట్రాలనుండి దిగుమతి చేసుకుంటున్నారు. దీనిలోభాగంగా ఇటీవలికాలంలో గ్లాడియోలస్ ఫ్లవర్స్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే వీటి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు రూ. 4 లక్షల వరకు ఆదాయం పొందేవీలుంది. మరి ఆ యాజమాన్య పద్దతులేంటో ఇప్పుడు చూద్దాం…

READ ALSO : Cluster Beans Cultivation : గోరుచిక్కుడు సాగు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తున్న రైతులు

ఎరుపు, తెలుపు, నీలి వర్ణాలతో కనిపిస్తున్న ఈ గ్లాడియోలస్ ఫ్లవర్స్ ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి కదూ.. ఈ పూలను విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సాగుచేస్తున్నారు.  ప్రస్థుతం గ్లాడియోలస్ పూల విస్తీర్ణం తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 -12 ఎకరాల్లో మాత్రమే వుంది. బొకేల తయారీ, వివిధ ఫంక్షన్లలో వీటి వాడకం విస్తృతంగా వుండటంతో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. చల్లని వాతావరణం, అధిక తేమ వున్న ప్రాంతాల్లో పెరిగే ఈ పంటను జూన్ నుండి ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు.

READ ALSO : Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !

నాటిన 45 రోజుల నుండి పూల దిగుబడి వస్తుంది. ఒక్కో కట్ ఫ్లవర్ డిమాండ్ ను బట్టి 10 నుండి 20 రూపాయల ధర పలుతుంటుంది. ఒక సారి విత్తనం నాటితే.. చాలు.. మళ్లీ విత్తనం కొనుగోలు చేయాల్సిన పని ఉండదు.. ఒక్కో దుంపనుండి మూడు నాలుగు దుంపలు వస్తాయి. వాటినే విత్తనంగా వాడుకోవడమే కాకుండా.. అమ్ముకొని అదనపు ఆదాయం పొందవచ్చు. అయితే వీటిని సాగుకు ఎలాంటి నేలలు అనుకూలం.. ఎరువులు, నీటి తడులు ఎప్పుడెప్పుడు అందించాలో సమగ్ర యాజమాన్యాన్ని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా , చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సందీప్ నాయక్.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

జూన్ నుండి డిసెంబరు వరకు నాటుకోవచ్చు. నాటటానికి ముందు దుంపలపై వుండే గోధుమ రంగు పొలుసులను తొలగించి నాటుకోవాలి. పూల సరఫరా కాలాన్ని పెంచడానికి ప్రతి 15 రోజుల రోజుల నుండి నెల రోజుల వ్యవధిలో దుంపలను నాటుకోవడం వలన మంచి మార్కెట్‍ను పొందవచ్చు. అంతే కాదు కాడలను కోసినప్పుడు 2 శాతం సుక్రోజ్ లేదా గుప్పెడు చెక్కెర కలిపిన నీటిలో కాడలు పెట్టాలి. తద్వారా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు