Turmeric Crop
Turmeric Production : నాణ్యమైన పసుపు ఉత్పత్తి సాధించాలంటే దుంపతీత, ఉడకబెట్టే సమయంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దుంపను తవ్వే విధానం, ఉడకబెట్టే విధానం, పసుపు పాలిషింగ్ వంటి ప్రక్రియలపైనే నాణ్యత ఆధారపడి వుంటుంది. దీన్ని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు.
READ ALSO : Sesame Cultivation : ఖరీఫ్ నువ్వుసాగులో మెళకువలు
అధిక దిగుబడి సాధించినప్పటికీ మార్కెట్లో అధిక ధర పొందాలంటే నాణ్యతే ప్రామాణికంగా వుంటుంది కాబట్టి, దీనిపై ప్రతి రైతు తగిన అవగాహన కలిగి వుండాలంటూ.. నాణ్యమైన పసుపు ఉత్పత్తికి అనుసరించాల్సిన ఆధునిక పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు , కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. సుధా జాకబ్.
తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘాకాలిక పసుపు రకాలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. వీటి పంటకాలం 9 నెలలు. ప్రస్థుతం 210 రోజుల్లో పంటచేతికొచ్చే స్వల్పకాలిక రకాల సాగు విస్తరిస్తున్నప్పటికీ అధికశాతం మంది రైతులు దీర్ఘకాలిక రకాలను ఎక్కువ సాగుచేస్తున్నారు.
READ ALSO : Turmeric Cultivation : పసుపు సాగులో విత్తన శుద్ధి..
పసుపు పచ్చదనం అంటే కుర్కుమిన్ శాతం అధికంగా వున్న రకాలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ప్రస్థుతం ఎకరాకు 30 నుండి 45 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి సాధిస్తున్నారు . అయితే దుంప తవ్వకం, పసుపు వండేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలపైనే ఈ నాణ్యత వుంటుంది.
సాధారణంగా 100 క్వింటాళ్ల పచ్చి దుంపలను, వండిన తర్వాత 21 శాతం రికవరీవస్తుంది. అంటే 100 క్వింటాళ్లకు 21క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి రావాలి. ఇదంతా క్రమ బద్దంగా జరగాలంటే పసుపు దుంపతీత దశ నుంచి శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. సుధా జాకబ్.
READ ALSO : Turmeric : పసుపులో దుంప, వేరుకుళ్లు తెగులు , నివారణ చర్యలు !
పుసుపు తీసిన 4 నుండి 5 రోజుల్లో దుంపలను ఉడకబెట్టి ఆరబెట్టుకోవాలి. దీనివల్ల పసుపు నాణ్యత, కుర్కుమిన్ శాతం తగ్గకుండా వుంటుంది. దుంపలను ఉడకబెట్టేటప్పుడు దుంపలు కళాయిల ఎంపికలో జాగ్రత్తలు ఎంచుకోవాలి. అలాగే దుంపల్లో తేమ 8శాతానికి వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి.