Lady finger Cultivation : వేసవి బెండసాగుకు అనువైన రకాలు – అధిక దిగుబడులకు సాగులో మేలైన యాజమాన్యం 

Lady finger Cultivation : బెండను ఏడాది పొడవునా సాగుచేసినప్పటికీ.. ఖరీఫ్, వేసవిలో వేసినప్పుడు మంచి దిగుబడి వస్తుంది.

Tips for Lady finger Cultivation In Summer Season

Lady finger Cultivation : నీటి సౌకర్యం ఉన్నచోట రైతులు సంవత్సరం పొడవునా కూరగాయ పంటలు పండిస్తూ ఉంటారు. మార్కెట్ ఒడిదుడకులు లేని కూరగాయల్లో బెండ ఒకటి. బెండను ఏడాది పొడవునా సాగుచేసినప్పటికీ.. ఖరీఫ్, వేసవిలో వేసినప్పుడు మంచి దిగుబడి వస్తుంది. శీతాకాలంలో అంతగా పెరగని బెండ.. వేసవికాలంలో మంచి దిగుబడినిస్తుంది.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

అయితే, ఈ కాలంలో పల్లాకు తెగులు, రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటాయి. వీటిని తట్టుకునే రకాలను ఎంచుకొని.. సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించానట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి.

ఇటీవలి కాలంలో వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా మారింది. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా  బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సకాలంలో తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండసాగులో ఎకరాకు 10టన్నుల దిగుబడిని సాధించవచ్చు.

మన ప్రాంతంలో బెండను దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. దీని సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం . అందువల్ల తొలకరి పంటగా జూన్ నుంచి ఆగష్టు వరకు, వేసవి పంటగా జనవరి నుంచి ఈ పంటను సాగుచేస్తున్నారు. రబీలో సాగుచేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొని సాగుచేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.

బెండలో సూటి రకాలతో పాటు అధిక దిగుబడులిచ్చే పలు సంకరరకాలు అందుబాటులో వున్నాయి. అయితే వాటి సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే  ప్రధానంగా రసం పీల్చు పురుగుల నివారణ పట్ల రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ తెగులు వ్యాప్తి వుండదు. దీంతో నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు