clash between two YCP groups in kadpa district : కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘర్షణలో జరిగిన పరస్పర దాడుల్లో ఒక వ్యక్తి మరణించాడు. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేసేందుకు కొండాపురం మండలం పి.అనంతపురంలో శుక్రవారం నిర్వహించిన రీ సర్వేలో ఈ ఘర్షణ జరిగింది.
స్ధానిక అధికార వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగటంతో బాహీ బాహీ తలపడ్డారు. ఇరు వర్గాలు బాహా బాహీ తలపడటంతో రామసుబ్బారెడ్డి వర్గీయుడు గురునాధ్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా….ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
ఈ ఘర్షణలో మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.