AP Covid-19 Updates : ఏపీలో 10వేల మార్క్ దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు 10వేల మార్క్ దాటేశాయి. ఏపీలో కొత్తగా 10,759 కరోనా కేసులు నమోదు కాగా, 31మంది మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 66,944 యాక్టివ్ కేసులు నమోదు కాగా, 7,541 మంది మృతిచెందారు.

AP Covid-19 Updates : ఏపీలో కరోనా కేసులు 10వేల మార్క్ దాటేశాయి. ఏపీలో కొత్తగా 10,759 కరోనా కేసులు నమోదు కాగా, 31మంది మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 66,944 యాక్టివ్ కేసులు నమోదు కాగా, 7,541 మంది మృతిచెందారు.

చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1474 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 41,871 శాంపిల్స్ పరీక్షించారు.

కర్నూలుజిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, అనంతపూర్, వైఎస్ఆర్ కడప, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 3,992 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ 1,58,35,169 శాంపిల్స్ పరీక్షించారు.