Tamoto
Tomato: టమాటకు గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారబోసి ఆందోళనలు చేసిన రోజులు ఎన్నో.. కానీ, అదే టమాట దొరక్కపోవడంతో ఇప్పుడు టమాట రేట్లు ఆకాశాన్ని అంటాయి. రైతుల నుంచి దిగుబడి తక్కువ కావడం.. వర్షాల ప్రభావంతో ముఖ్యంగా మదనపల్లి లాంటి ఏరియాల్లో టమాట ఎక్కువ పండించే చోట్ల కూడా దిగుబడి తక్కువగా ఉండడంతో టమాట ధరలకు రెక్కలొచ్చాయి.
చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌లో మొదటి రకం టమాట ధర ఇప్పుడు వంద రూపాయలు దాటేసింది. మదనపల్లి హోల్ సేల్ మార్కెట్‌లోనే టమాట ధర రూ. 102 పలుకుతోంది. ఇప్పుడు రీటైల్ మార్కెట్లో కిలో రూ.120 బహిరంగ మార్కెట్లో రూ.150 వరకు ఉంది. ఊహించని విధంగా టమాటో ధర సెంచరీ కొట్టేయడంతో సామాన్యులు కొనడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tiruchanur Brahmotsavam : సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో పద్మావతి అమ్మవారు
ఈ ఏడాది మొదట్లో కిలో రూ.6 నుంచి రూ.14 వరకు ఉన్న టమాట వర్షాల తర్వాత వంద దాటేసింది. మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాట ఎగుమతి జరుగుతుంది.