Tiruchanur Brahmotsavam : సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలోశ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు.

Tiruchanur Brahmotsavam : సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో పద్మావతి అమ్మవారు

Tiruchanur Surya Prabha Vahanam

Tiruchanur Brahmotsavam : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలోశ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
Also Read : Hyderabad MMTS Trains : ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయాల్లో మార్పు
తిరుపతికి చెందిన శ్రీ పొన్నాల సుధాకర్, శ్రీ ఉదయ్ అనే భక్తులు సోమవారం ఉదయం 100 డజన్ల గాజులు, హుండీ బట్టలు విరాళంగా అందించారు. వీటిని జెఈఓ శ్రీ వీరబ్రహ్మంకు అందజేశారు.