Hyderabad MMTS Trains : ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయాల్లో మార్పు

దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను అధికారులు పెంచారు. దీంతో వాటి సమాయాల్లో మార్పులు జరిగాయి. హైదరాబాద్ నగర ప్రజలను ఇతర రవాణా సౌకర్యలకంటే త

Hyderabad MMTS Trains : ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయాల్లో మార్పు

Hyderabad Mmts Trains

Hyderabad MMTS Trains :  దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను అధికారులు పెంచారు. దీంతో వాటి సమాయాల్లో మార్పులు జరిగాయి. హైదరాబాద్ నగర ప్రజలను ఇతర రవాణా సౌకర్యలకంటే తక్కువ ఛార్జీతో ఎక్కవ దూరం ప్రయాణికులను చేరవేస్తున్నాయి ఎంఎంటీఎస్ రైళ్లు.

కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో పలు రైలు సర్వీసులను రైల్వే శాఖ నిలిపి వేసింది. కోవిడ్ తగ్గుముఖం పట్టాక దశలవారీగా రైలు సర్వీసులను పునరుధ్దరిస్తున్నారు. లింగంపల్లి-ఫలక్‌నుమా, హైదరాబాద్‌-లింగంపల్లి, సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ మధ్య నడిచే ఎంఎంటీఎస్  రైళ్ల సంఖ్య ను దక్షిణమధ్య రైల్వే 79కి పెంచింది.

లింగంపల్లి- ఫలక్‌నుమా మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సమయాలు
ఉదయం 5.50, 6.10, 6.50, 8.25, 905, 10,05, 11.20, 11.40,
మధ్యాహ్నం 12.40, 1.25, 2.40, 3.10,
సాయంత్రం 4.40 5.10, 5.30, 6.00, 6.35, 7.55,
రాత్రి 9.00, 9.15, 9.45 గంటలకు ఎంఎటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు అదనంగా రాత్రి 10.20, 11.25 గంటలకు కూడా ఉన్నాయి.

ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి…
ఉదయం 4.45, 6.30, 7.25, 8.30, 8.50, 10.02, 11.00, 11.42,
మధ్యాహ్నం 1.00, 1.30, 3.00, 3.50, 4.15 గంటలకు,
సాయంత్రం 5.15, 6.17, 7.10, 7.30 గంటలకు,
రాత్రి 8.00, 8.40 11.05, 11.35 గంటలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి.

Also Read : Omicron Effect : రైల్వే స్టేషన్‌ని తలపిస్తున్న ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు..
ఉదయం 6.40, 7.40, 8.10, 9.15, 10.15, 11.10, 11.55,
మధ్యాహ్నం 12.50, 1.20, 2.25, 3.30,
సాయంత్రం 4.10, 5.55, 6.55,
రాత్రి 8.05, 9.25 గంటలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి.

హైదరాబాద్‌ నుంచి లింగంపల్లికి..
ఉదయం 5.40, 6.40, 7.55, 9.00, 10.00, 10.55, 11.35,
మధ్యాహ్నం 12.20, 1.00, 2.00, 3.00, 3.35,
సాయంత్రం 4.30, 5.20, 6.55,
రాత్రి 7.55, 10.15 గంటలకు ఎంఎంటీఎస్‌లు బయలుదేరుతాయని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.