14 సంవత్సరాలు సీఎం..25 ఇయర్స్ పార్టీ అధ్యక్షుడిని..నాపై దాడి చేస్తారా

  • Publish Date - November 28, 2019 / 12:52 PM IST

14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా..25 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా..తనపై దాడి చేస్తారా ? అంటూ ప్రశ్నించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. తాను రాజధాని అమరావతిలో పర్యటిస్తే..వైసీపీ పార్టీ..రౌడీలను పంపించి రాళ్లు..చెప్పులతో దాడి చేయించారు..లా అండ్ ఆర్డర్ సమస్య లేదని డీజీపీ అనడాన్ని..తమపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు..గర్హిస్తున్నట్లు వెల్లడించారు. తమపైనే ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నారంటే..సామాన్యుడి పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పాలనే రాజధానిలో పర్యటించడం జరిగిందన్నారు. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం రాజధాని పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు బాబు. 

రాజధాని కోసం భూములు ఇచ్చి రైతులు త్యాగం చేశారని గుర్తు చేశారు. భూమి ఇస్తే..25-30 శాతం ల్యాండ్ ఇస్తానని తాను హామీనివ్వడం జరిగిందన్నారు. ఇక్కడ జరిగిన పనులకు..వైసీపీ వాళ్లు చెప్పిన మాటలకు పొంతన లేదన్నారు. నూటికి 90 శాతం బిల్డింగ్స్ పూర్తయ్యాయని, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఎన్జీవో క్వార్టర్స్ చూడడం జరిగిందన్నారు. 
అమరావతి నిర్మాణం కోసం తమ హయాంలో 9 వేల 060 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వెల్లడించారు. రాజధానిలో రూ. 2 లక్షల కోట్ల సంపద సృష్టించిన ఘనత తమదని చెప్పుకొచ్చారు. రాజధాని పనులతో జీఎస్టీ ఆదాయం పెరిగిందని, భవిష్యత్‌లో ఆదాయం సమకూర్చే నగరంగా అమరావతి మారనుందని చెప్పారు. అనేక హామీలిచ్చి..ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని, రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు బాబు. 
Read More : హైదరాబాద్‌లో అభివృద్ధి అంటే..మొదట గుర్తుకొచ్చేది నేనే – బాబు