TDP Mahanadu : తెలుగుదేశం మహానాడు.. ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు

అమరావతి ఎలక్ట్రానిక్‌ సిటీలో 26 జిల్లాల యువతకు వచ్చే 3.80 లక్షల ఉద్యోగాలు పోగొడుతున్నారంటూ మరో తీర్మానం చేయనున్నారు.

TDP Mahanadu Resolutions : తెలుగుదేశం మహానాడుకు సర్వం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి (Rajahmundry) సమీపంలోని వేమగిరి(Vemagiri)లో మహానాడు నిర్వహించనున్నారు. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం మహానాడులో ఏపీకి సంబంధించి 15తీర్మానాలు చేయనున్నారు. ప్రజలను బాదుడే బాదుడు (badude badudu) పేరుతో ఆర్థికంగా కుంగదీస్తూ మోసకారి సంక్షేమాన్ని వైసీపీ (YCP) ప్రభుత్వం అమలుచేస్తోందని తీర్మానాల ద్వారా తెలుగుదేశం ఎండగట్టనుంది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు అండగా నిలబడతామనే భరోసాతో మహానాడు తీర్మానాలు చేయనున్నారు. యువతలో నూతన ఉత్సాహాన్ని, భరోసాన్ని నిలిపే దిశగా ‘యువగళం’ పాదయాత్ర సాగుతున్నందున, తెలుగుదేశం అధికారంలోకి రాగానే దేశాభివృద్ధిలో కీలకమైన యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించి వారి సర్వతోముఖాభివృద్దికి కృషి చేయనున్నట్లు మహానాడు తీర్మానించనుంది.

TDP Mahanadu : తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు పూర్తి.. 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతినిధుల సభ, 60 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ

అమరావతి ఎలక్ట్రానిక్‌ సిటీలో 26 జిల్లాల యువతకు వచ్చే 3.80 లక్షల ఉద్యోగాలు పోగొడుతున్నారంటూ మరో తీర్మానం చేయనున్నారు. సీఆర్‌డీఏ చట్టానికి విరుద్ధంగా సెంటు పట్టా పేరుతో ఎలక్ట్రానిక్‌ సిటీని ధ్వంసం చేస్తే.. లక్షలాది పేద పిల్లలకు మంచి ఉద్యోగాలు ఎలా వస్తాయని మహానాడు వేదికగా టీడీపీ ప్రశ్నించనుంది.

మంచి ఉద్యోగాలు లేకుండా పేదలు నిరుపేదలుగా ఉండిపోవడమే జగన్‌రెడ్డి కోరుకుంటున్నారా అని నిలదీయనుంది. పోలవరం, అమరావతి నిర్లక్ష్యంతో పాటు సహజ వనరుల దోపిడీ, ఆర్థిక సంక్షోభం, అవినీతి వంటి అంశాలపై టీడీపీ తీర్మానాలు చేయనుంది. తెలుగుదేశం మహానాడు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానుంది.

TDP Mahanadu : మహానాడుకు రండీ .. చంద్రబాబు డిజిటల్ సంతకంతో ప్రతినిధులకు ఆహ్వానం

రెండు రోజులపాటు మహానాడు జరుగనుంది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధం అవుతుంది. సన్నాహక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అధినేత చంద్రబాబు, నారా లోకేష్ రాజమండ్రికి రానున్నారు.

ట్రెండింగ్ వార్తలు