Corona : ఏపీలో కొత్తగా 164 కరోనా కేసులు, ఒకరి మృతి
ఏపీలో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,392 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- bheemraj
- Published On : November 20, 2021 / 09:38 PM IST
Ap Corona (1)
new corona cases in AP : ఏపీలో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,392 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి ఇప్పటివరకు 14,426 మంది మృతి చెందారు.
గత 24 గంటల్లో కరోనాతో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. కృష్ణా 32, విశాఖ 24, గుంటూరు జిల్లాలో 22 కరోనా కేసులు చొప్పున నమోదు అయ్యాయి. ఈ మేరకు శనివారం వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
AP Governor : నిలకడగా ఏపీ గవర్నర్ ఆరోగ్యం
గడిచిన 24 గంటల వ్యవధిలో 25,197 కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా బారి నుంచి 196 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
