ఏపీలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. భారీగా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 199 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య
ఏపీలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. భారీగా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 199 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందిన వారు 130 మంది ఉన్నారు. విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69మంది ఉన్నారు. విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,659 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు, కృష్ణాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 75కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,382. యాక్టివ్ కేసుల సంఖ్య 1,290. జూన్ 1 నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ మొత్తం 17,695 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.