×
Ad

చంద్రబాబు, లోకేశ్‌ వార్నింగ్‌లు వర్కౌట్‌ అవుతున్నట్లేనా? వారికి నోటీసులెందుకు?

అధికారంలోకి వచ్చి ఆరు నెలల తర్వాత నుంచే ఎమ్మెల్యేల పనితీరుపై ఓ కన్నేసి పెట్టారు సీఎం చంద్రబాబు.

Chandrababu Naidu: మారాల్సిన వారు మారిపోయారు. ప్రజల్లోనే ఉంటున్నారు. పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంకొందరు మాత్రం తమ దారి తమదే అన్నట్లుగా బిహేవ్‌ చేస్తూ అటు సీఎం చంద్రబాబుకు..ఇటు మంత్రి లోకేశ్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నారట. దీంతో తీరు మారని ఎమ్మెల్యేలు, మంత్రుల విషయంలో సీరియస్‌గా ఉన్నారట.

సరిగ్గా పనిచేయకుండా..ప్రజలకు అందుబాటులో లేకుండా..గ్రీవెన్స్ కూడా నిర్వహించిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులకు పార్టీ తరఫున నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆదేశించడం హాట్ టాపిక్‌ అవుతోంది. యాక్టీవ్‌గా పనిచేయని 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులకు పార్టీ తరఫున నోటీసులు ఇచ్చి..ఎక్స్‌ప్లెనేషన్ తీసుకోనున్నారు. (Chandrababu Naidu,)

అధికారంలోకి వచ్చి ఆరు నెలల తర్వాత నుంచే ఎమ్మెల్యేల పనితీరుపై ఓ కన్నేసి పెట్టారు సీఎం చంద్రబాబు. ఎప్పటికప్పుడు గ్రౌండ్‌లో పరిస్థితి..శాసనసభ్యులు, మంత్రుల పనితీరు..పబ్లిక్ రెస్పాన్స్‌పై రిపోర్టులు తెప్పించుకుని చంద్రబాబు, లోకేశ్ వరుసగా షాక్ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. గత నెలలో సీఎం చంద్రబాబు పార్టీ ఆఫీస్‌ను సందర్శించిన టైమ్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తున్న 48 మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు.

Also Read: కొత్త లేబర్‌ కోడ్స్‌: గిగ్ వర్కర్లు సహా ఉద్యోగులు తెలుసుకోవాల్సిన 5 కీలక అంశాలు ఇవే.. ఎన్ని లాభాలో..

ఇక అంతకు ముందు పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్.. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్ పెట్టాలని సూచనలు చేశారు. దీంతో ఎమ్మెల్యేల్లో కొంతవరకు మార్పు వచ్చినా, మరికొందరు తీరు మాత్రం మారట్లేదని అధిష్టానికి సమాచారం చేరిందట. దీంతో లేటెస్ట్‌గా పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్.. తర్వాత జోనల్ కోఆర్డినేటర్లతో చర్చించారు.

పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో సరిగ్గా పనిచేయని 25 మందికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఈ 25 మందిలో ఇద్దరు మంత్రులు కూడా ఉండటం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే మంత్రి లోకేశ్ ఆగ్రహానికి గురైన ఆ 25 మంది పేర్లు బయటకు రాకపోయినా, ఈ జాబితాలో పేర్లు ఉంటున్న ఎమ్మెల్యేలకు టికెట్‌ విషయంలో ఇబ్బందులు తప్పవన్న గుసగుసలు మొదలయ్యాయి.

ప్రజలకు అందుబాటులో లేరా?
పార్టీని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తుండటం ఒక ఎత్తు అయితే..నార్మల్ పబ్లిక్‌కు ఎమ్మెల్యేల అవేలెబుల్‌ లేకపోవడంపై చంద్రబాబు, లోకేశ్‌ ఆగ్రహంగా ఉంటున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలవాలంటే కార్యకర్తలు, పార్టీని జాగ్రత్తగా చూసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. కానీ, కొందరు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా, తమ తీరు మార్చుకోవడం లేదని, పార్టీని గాలికి వదిలేసి సొంత పనులకు చక్కబెట్టుకునే పనిలో పడ్డారని మంత్రి లోకేశ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట.

ఇలా అయితే కష్టం. మీరు ఇబ్బంది పడుతారు. పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడే అలర్ట్‌ అవ్వండి. ఇక నుంచి అయినా పూర్తిస్థాయిలో పబ్లిక్‌లో ఉండండి అంటూ ఎమ్మెల్యేలు, మంత్రులకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు ఇచ్చేందుకు కూడా పలువురు ఎమ్మెల్యేలు టైమ్‌ కేటాయించడం లేదట.

ఈ విషయం తెలిసి మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని అంటున్నారు. అందుకే ఇద్దరు మంత్రులతో సహా 25 మంది ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. పని ఒత్తిడి వల్లే కార్యకర్తలకు బీమా చెక్కులు ఇవ్వలేకపోయామని ఓరల్‌గా రిప్లై ఇచ్చారని అంటున్నారు. అయితే మంత్రి లోకేస్ సీరియస్ వార్నింగ్‌తో లిఖిత పూర్వక వివరణ ఇచ్చేందుకు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు రెడీ అవుతున్నారట. గతంలో ఏకంగా 65 మంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు, లోకేశ్‌ అసంతృప్తిగా ఉన్నట్లుగా లీకులు వచ్చాయి.

క్యాబినెట్‌లో ఏకంగా ఆరుగురు మంత్రుల వర్కింగ్‌ స్టైల్ బాలేదని ప్రచారం జరిగింది. ఏకంగా క్యాబినెట్ షఫ్లింగ్‌ అంటూ లీకులు వచ్చాయి. కట్‌ చేస్తే..అందులో సగానికి పైగా ఎమ్మెల్యేలు సెట్‌రైట్‌ అయిపోయారట. మంత్రుల్లో కూడా ఆల్‌మోస్ట్‌ అందరూ పబ్లిక్‌లోనే ఉంటూ..డిస్ట్రిక్‌ టూర్లు..నియోజకవర్గ పర్యటనలతో బిజీ అయిపోతున్నారట.

మొంథా తుఫాన్‌ సమయంలో బాగా పనిచేశారంటూ మంత్రులను చంద్రబాబు అప్రిషియేట్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో వెంటపడితే మార్పు వస్తుందని భావిస్తున్న చంద్రబాబు, లోకేశ్..పదే పదే ఎమ్మెల్యేలు, మంత్రులకు వార్నింగ్‌లు, మందలింపులు, సూచనలతో ఇంకో ఆరు నెలల వరకు అందరినీ యాక్టీవ్‌ మోడ్‌లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. టీడీపీ పెద్దల ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలు తెచ్చి పెడుతాయో చూడాలి మరి.