జేసీ దివాకర్ రెడ్డికి షాక్ : 23 బస్సులు సీజ్

మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులు సీజ్ చేశారు.

  • Publish Date - October 17, 2019 / 05:55 AM IST

మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులు సీజ్ చేశారు.

మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులు సీజ్ చేశారు. ఆర్టీఏ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమీషనర్  ప్రసాద్ రావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం, ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు పెంచటం వంటి ఆరోపణలు వచ్చాయని, అవి నిజమేనని తేలటంతో సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. 

ఒక్క రూట్ కోసం పర్మిషన్ తీసుకొని, మరో రూట్ లో నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని బస్సులకు పర్మిట్ లు కూడా లేవని ఆరోపణలతో సీజ్ చేశారు. దివాకర్ రెడ్డికి చెందిన 23 బస్సులతోపాటు మిగిలిన ప్రైవేట్ బస్సులను కూడా సీజ్ చేశామని అధికారులు తెలిపారు.

ఒక్క అనంతపురం జిల్లాలోనే దివాకర్ రెడ్డికి చెందిన 8 బస్సులను సీజ్ చేశారు. అనంతపురంలో 4 బస్సులు, గుంతకల్ లో 3, పెనుగొండలో ఒక బస్సును ఆర్టీఏ అధికారులు రాత్రి సీజ్ చేశారు. సీజ్ చేసిన బస్సులను ఆర్టీసీ డిపోలో ఉంచినట్లు సమాచారం. 

ఒక రూట్ లో పర్మిషన్ తీసుకొని, మరో రూట్ లో నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని బస్సులకు పర్మిట్ లు కూడా లేవనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో దివాకర్ రెడ్డికి చెందిన 23 బస్సులతో పాటు మిగిలిన వారి ప్రైవేట్ బస్సులను కూడా సీజ్ చేశామని అధికారులు తెలిపారు.

వారికి గతంలో అనేక సార్లు చెప్పామని.. కానీ పట్టించుకోలేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలో దివాకర్ రెడ్డికి చెందిన 8 బస్సులు, మిగతా వారికి చెందిన 10 బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు. అనంతపురం జిల్లాలో మొత్తం 18 బస్సులను సీజ్ చేసినట్లు అనంతపురం ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. ఒక్క బస్సుకు పర్మిషన్ తీసుకుని..దాని పేరు మీద రెండు నుంచి మూడు బస్సులను తిప్పుతున్నారని అధికారులు చెబుతున్నారు. 

కానీ జేసీ బ్రదర్స్ తో మీడియా ప్రతినిధులు మాట్లాడగా 1943 నుంచి బస్సులను నడుపుతున్నామని..ట్రాన్స్ పోర్టు విధానంలో అన్ని తెలుసన్నారు. అన్నింటికి పర్మిట్లు ఉన్నాయని తెలిపారు. అధికారులకు పైనుంచి ఉన్న ఒత్తిళ్లలో భాగంగానే రూట్ బస్సులను సీజ్ చేశారని తెలిపారు.

తమ బస్సులనే కాకుండా అనేక కంపెనీలకు చెందిన బస్సులను కూడా సీజ్ చేశారని చెబుతున్నారు. దీనికి సంబంధించి అదికారులతో మాట్లాడమని చెబుతున్నారు. సీజ్ చేసిన బస్సులను విడిపించుకునే విధంగా ఇప్పటికే అధికారులతో మాట్లాడామని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో చెప్పారు.