NTR Coins : రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణేల విక్రయం

ఇప్పటి వరకు స్మారక నాణేల్లో అత్యధికంగా 12,000 నాణేలు మాత్రమే విక్రయించామని, ఈ రికార్డును ఎన్టీఆర్ స్మారక నాణెం అధిగమించిందని తెలిపారు.

NTR commemorative coins

NTR Commemorative Coins : కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ స్మారక నాణేలను విడుదల చేసిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో 2 నెలల్లో 25వేల ఎన్టీఆర్ స్మారక నాణేల విక్రయం జరిగింది. ఎన్టీఆర్ స్మారక నాణేలను రెండు నెలల్లోనే 25 వేలు విక్రయించడం దేశంలోనే సరికొత్త రికార్డని హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ టీడీ. జనార్ధన్ శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వీఎన్ఆర్ నాయుడు పాల్గొని, మాట్లాడారు.

ఎన్టీఆర్ స్మారక నాణెం హైదరాబాద్ మింట్ లో తయారు కావడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఇప్పటి వరకు స్మారక నాణేల్లో అత్యధికంగా 12,000 నాణేలు మాత్రమే విక్రయించామని, ఈ రికార్డును ఎన్టీఆర్ స్మారక నాణెం అధిగమించిందని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 200 మంది ప్రముఖులకు సంబంధించి స్మారక నాణేలను విడుదల చేయగా ఎన్టీఆర్ స్మారక నాణెం విక్రయాల్లో తొలి స్థానంలో ఉండడం గర్వకారణమని టీడీ జనార్ధన్ అన్నారు.

Gold Rate Today : బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా? స్వల్పంగా తగ్గిన వెండి ధర

అనంతంరం శ్రీనివాస్ గుండపనేని, తానాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కంఠమనేని రవిశంకర్, భగీరథ, విక్రమ్ పూల, దొప్పలపూడి రామ్ మోహన్, మండవ సతీష్ తదితరలు పాల్గొన్నారు.