ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 20,245 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 2,592 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.
మరో 837 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఏపీలోని పలు జిల్లాల్లోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అనంతపూర్ జిల్లాలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు మరణించారు.
ఇక గుంటూరులో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూల్ జిల్లాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కృష్ణ జిల్లాలో ఒకరు మరణించారు.
ఈ రోజు శుక్రవారం (జులై 17) వరకు రాష్ట్రంలో 12,60, 512 మంది నుంచి శాంపిల్స్ పరీక్షించినట్టు అధికారులు తెలిపారు. ఏపీలో 16,584 మంది ఆస్పత్రుల్లో, 3,230 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో మొత్తం 19,814 మంది చికిత్స పొందుతున్నారు.