కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. 24 గంటల్లో 2,602 కేసులు నమోదయ్యాయి.
ఇతర రాష్ట్రాలకు 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40, 646 కు చేరింది. పాజిటివ్ కేసులతోపాటు మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొద్ది రోజుల క్రితం వరకు రోజుకు 10 మంది లోపే ఉన్న కరోనా మరణాల సంఖ్య గత నాలుగైదు రోజులుగా రోజుకు 40 కు పైగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో 42 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. అనంతపురం 6, చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం 5 చొప్పున మరణించారు.
ప్రకాశం జిల్లాలో ఐదుగురు చొప్పున మరణించారు. గుంటూరు, పశ్చిమగోదారి జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కడప, విశాఖలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరు, విజయనగరంలో ఇద్దరు మృతి చెందగా కృష్ణాలో ఒకరు మృతి చెందారు.
దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 534 కు చేరింది. ఇక ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 19 వేల 814 ఉండగా కోలుకున్న వారి సంఖ్య 20 వేల 290కి చేరుతుంది. 24 గంటల్లో 20 వేల 245 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షల 60 వేల 512 టెస్టులు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 643 కేసులు నమోదయ్యాయి.