261 new corona cases : ఏపీలో 24 గంటల్లో కొత్తగా 261 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 261 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

261 new corona cases : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 261 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 125 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కొవిడ్‌ పాజిటివ్‌ కేసు సంఖ్య 8,92,269కి చేరింది. 8,83,505 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 1579 యాక్టివ్‌ కేసులుండగా.. 7185 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 23,417 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 1,45,80,783 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ప్రైవేట్ స్కూల్ లో ఆరో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తగా స్కూల్ ని మూసేశారు. రెండు రోజలు క్రితం స్కూల్ లో చదివే ఇద్దరు విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. వారిని నిన్న(మార్చి 15,2021) ఆస్పత్రికి తీసుకెళ్లి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో యాజమాన్యం ఇవాళ(మార్చి 16,2021) నుంచి పాఠశాల మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బడిలో 400 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఏపీలో నిన్న 147 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కేసులు వచ్చాయి. 22వేల 604 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా, 0.65 శాతం మందికి పాజిటివ్‌గా తేలింది. తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులు కరోనా బారిన పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు