AP IPS Transfer : ఏపీలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ.. మొత్తం 30మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు

AP IPS Transfer : ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 30 మంది ఐపీఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

30 ips officers transferred in andhra pradesh state government issued orders

AP IPS Transfer : ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 30 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి (జనవరి 29) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్ సింగ్, రైల్వే పోలీసు అదనపు డీజీగా విశ్వజిత్, ఆక్టోపస్ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి బదిలీ అయ్యారు.

Read Also : రాజ్యసభ రేసులో టీడీపీ? టచ్‌లో 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు?

బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. 

  • ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్ సింగ్
  •  రైల్వే పోలీసు అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్
  • ఆక్టోపస్ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్
  • విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి
  • డీఐజీ (ట్రైనింగ్)గా రాహుల్ దేవ్ శర్మ
  • విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని
  • కర్నూల్ రేంజ్ డీఐజీగా సీహెచ్ విజయ్ రావ్
  • విశాఖ జాయింట్ కమిషనర్ గా షకీరప్ప
  • వెస్ట్ గోదావరి ఎస్పీగా అజిత వెజెండ్ల
  • సీఐడీ ఐజీగా సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి
  • ఐజీ, పర్సనల్‌గా ఎస్ హరికృష్ణ
  • స్పోర్ట్స్ ఐజీగా కేవీ మోహన్ రావు
  • ఆక్టోపస్ డీఐజీగా సెంథిల్ కుమార్
  • లా అండ్ ఆర్డర్ డీఐజీగా సెంథిల్ కు అదనపు బాధ్యతలు
  • కృష్ణా జిల్లా ఎస్పీగా అద్నాన్ నయూమ్ అస్మి
  • ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్‌గా అమిత్ బర్ధార్
  • ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీగా అరిఫ్ హఫీజ్
  • రాజమండ్రి రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా సుబ్బారెడ్డి
  • ఎస్పీ, సీఐ సెల్‌గా వై రిశాంత్ రెడ్డి
  • విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా ఛందోలు మణికంఠ
  • చిత్తూరు జిల్లా ఎప్పీగా పి.జాషువా
  • ఎస్ఎల్ పీబీ చైర్మన్, హోంగార్డ్స్ ఐజీగా రాజశేఖర్ బాబుకు అదనపు బాధ్యతలు
  • ఏసీబీ ఎస్పీగా రవిప్రకాష్
  • ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ అధిరాజ్ సింగ్ రాణా
  • ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ కృష్ణకాంత్ పటేల్
  • గుంటూరు జిల్లా ఎస్పీగా తుషార్ దుడి
  • జగ్గయ్యపేట డీసీపీగా కె. శ్రీనివాసరావు
  • రంపచోడవరం ఏఎస్పీగా కునుబల్లి ధీరజ్
  • విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా ఆనంద్ రెడ్డి
  • విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ-2గా మోకా సత్యనారాయణ

Read Also : ఆయన ఆశీస్సులు ఉన్న వారికే ఎమ్మెల్యే టికెట్..! నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఎంపికలో ట్విస్టుల మీద ట్విస్టులు