Pawan Kalyan(Photo : Google)
Pawan Kalyan – Women Missing : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో 30వేల 196 మంది బాలికలు, మహిళలు మిస్సింగ్ అయినట్లు కేంద్రం చెప్పిన లెక్కలు కలకలం రేపుతున్నాయి. మిస్సింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది. అమ్మాయిల అదృశ్యం వ్యవహారంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్రం వెల్లడించిన లెక్కల ఆధారంగా మరోసారి జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
ఏపీలో 30వేల 196 మంది మహిళలు, బాలికలు అదృశ్యమైనట్లు పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటించారు. దీనిపై ఏపీ మహిళా కమిషన్ బహిరంగంగా మాట్లాడగలదా? వైసీపీ ప్రభుత్వాన్ని మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా? అని పవన్ కల్యాణ్ నిలదీశారు. కేంద్రమంత్రి ప్రకటనపై హోంమంత్రి, డీజీపీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
Also Read..Kuppam: వైనాట్ 175 అంటున్న వైసీపీ.. కొత్త టార్గెట్ పెట్టుకున్న చంద్రబాబు.. రీచ్ అవుతారా?
‘ఏపీ మహిళా కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది? కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 30,196 మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న బాలికలు 7వేల 918 మంది, 18 ఏళ్లు పైబడిన మహిళలు 22వేల 278 మంది అదృశ్యమయ్యారు.
Also Read..Andhra Pradesh: బాలికలు, మహిళల మిస్సింగ్‌పై సంచలన విషయాలు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే మన ఆంధ్రప్రదేశ్‌లో తప్పిపోయిన బాలికలు, మహిళల సంఖ్య పెరుగుతున్న ధోరణిలో ఉంది. మన అమ్మాయిలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు? వారికి ఏం జరుగుతోంది? ఎవరు బాధ్యత తీసుకుంటారు? రేపు ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనిపై బహిరంగంగా మాట్లాడుతుందా? ఏపీ మహిళా కమిషన్ హోంశాఖ, డీజీపీని వివరణ కోరుతుందా? ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా? ఈ అంశంపై హోంమంత్రి, డీజీపీ స్పందించాలని జనసేన డిమాండ్ చేస్తోంది.”
మహిళలు… బాలికల అదృశ్యంపై @ysjagan సర్కార్ ఇప్పుడేం చెబుతుంది? – JanaSena Party PAC Chairman Shri @mnadendla#WakeupAPMahilaCommission #SaveAPfromYCP pic.twitter.com/PRD5OdZJUY
— JanaSena Party (@JanaSenaParty) July 26, 2023