Andhra Pradesh: బాలికలు, మహిళల మిస్సింగ్‌పై సంచలన విషయాలు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడేళ్లలో (2019 నుంచి 2021 వరకు) మొత్తం 72,767 మంది అదృశ్యం అయినట్లు హోం శాఖ వివరించింది.

Andhra Pradesh: బాలికలు, మహిళల మిస్సింగ్‌పై సంచలన విషయాలు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

Missing girls

Updated On : July 26, 2023 / 6:48 PM IST

Andhra Pradesh – Telangana: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాలికలు, మహిళల అదృశ్యంపై పార్లమెంటు(Parliament)లో అడిగిన ప్రశ్నలకు కేంద్ర సర్కారు (NDA Govt) సమాధానం చెప్పింది. 18 ఏళ్ల లోపు వయసున్న బాలికలు, 18 ఏళ్లు దాటిన మహిళల అదృశ్యంపై నమోదైన కేసుల వివరాలు వెల్లడించించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడేళ్లలో (2019 నుంచి 2021 వరకు) మొత్తం 72,767 మంది అదృశ్యం అయినట్లు హోం శాఖ వివరించింది. బాలికలు 15,994 మంది, మహిళలు 56,773 ఉన్నారని చెప్పింది. 2019 నుంచి 2021 వరకు మూడు ఏళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యం అయ్యారని పేర్కొంది.

అలాగే, 2019లో 2,186 మంది బాలికలు, 6,252 మంది మహిళలు మిస్ అయినట్లు చెప్పింది. 2020లో 2,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు అదృశ్యమయ్యారని పేర్కొంది. 2021లో 3,358 మంది బాలికలు, 8,969 మంది మహిళలు మిస్ అయినట్లు తెలిపింది.

ఇక మూడేళ్లలో (2019 నుంచి 2021 వరకు) తెలంగాణలో 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యం అయ్యారు. 2019లో 2,849 మంది బాలికలు, 10,744 మంది మహిళలు అదృశ్యమయ్యారు. 2020లో 2,232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు మిస్ అయ్యారు. 2021లో 2,994 మంది బాలికలు,12,834 మంది మహిళలు అదృశ్యమయ్యారు.

No Confidence Motion: అవిశ్వాస తీర్మానం చరిత్ర తెలుసా? ఇంతకీ ఎన్ని సఫలమయ్యాయి, ఎన్ని విఫలమయ్యాయి?