Nara Lokesh : పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ చిట్ చాట్ చేశారు. నిన్న ప్రవేశపెట్టిన వాట్సప్ గవర్నెన్స్ పై మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందన్నారు. అక్కడక్కడా చిన్నపాటి సమస్యలు ఉన్నా వారం రోజుల్లో పూర్తి స్థాయిలో 161 సేవలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులోకి వస్తాయన్నారు. సాంకేతికత వినియోగంలో ఇదో విప్లవాత్మక మార్పనే చెప్పాలని లోకేశ్ పేర్కొన్నారు.
పారదర్శకత పెరిగి అవినీతి కూడా తగ్గుతుంది..
మరిన్ని మెరుగైన సేవలు తెచ్చేందుకు చట్ట సవరణలు సైతం చేస్తున్నట్లు ఆయన వెల్లడించరు. 6 నెలల్లో 520 సేవలు అందుబాటులోకి తెచ్చి సుపరిపాలన దిశగా అడుగులు వేస్తామన్నారు నారా లోకేశ్. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత పెరిగి అవినీతి కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వాట్స్ ప్ గవర్నెన్స్ వాడితే వ్యక్తిగత సమాచారం బయటకు లీకయ్యే సమస్యే లేదని తేల్చి చెప్పారు నారా లోకేశ్.
Also Read : విజయనగరం డీసీసీబీ పీఠంపై తెలుగు తమ్ముళ్ల ఎత్తులు.. తమకు అనుకూలంగా ఉండే నేతకు పదవి దక్కేలా లాబీయింగ్..!
జగన్ పెట్టిపోయిన బకాయిలు మేము చెల్లిస్తున్నాం..
మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు నారా లోకేశ్. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు 3 వేల కోట్లు పెట్టి దిగిపోయారని జగన్ పై ధ్వజమెత్తారు. మేము మా విడతగా రూ.800 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. జగన్ పెట్టిన ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలపై వైసీపీ నేతలు ఆందోళనలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్.. రైతులకు పెట్టిన ధాన్యం బకాయిలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు అన్నీ మేమే తీరుస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Also Read : మారిన వైసీపీ వ్యూహం.. బడ్జెట్ సెషన్‌కు జగన్?
అందుకోసమే ఆపార్ కార్డ్ విధానం తెస్తున్నాం..
అలాగే జగన్ పెట్టిన ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు తీర్చేది కూడా మేమేనని ఆయన స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందన్నారు. విద్యార్థుల సంఖ్య కచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు ఆపార్ కార్డ్ విధానం తెస్తున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ నివారణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు.