ఏపీలో మరో 80 కరోనా కేసులు.. కోవిడ్ @1177

  • Publish Date - April 29, 2020 / 11:23 AM IST

లాక్‌డౌన్ కారణంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతాయి అనుకుంటే రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 80 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్యను ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో విడుదల చేసింది. కర్నూలులో కొత్తగా 13, గుంటూరులో 23, కృష్ణా జిల్లాలో 33, పశ్చిమ గోదావరిలో 3, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 7 కేసులు నమోదైనట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరంలో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  మొత్తం 1,177కి చేరుకుంది. కర్నూలులో అత్యధికంగా 292, ఆ తర్వాత గుంటూరులో 237 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరుకోగా.. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 911గా ఉంది. 235 మంది కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు.