ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం తగ్గినట్టే కనిపించిన కరోనా కేసులు ఏపీలో క్రమంగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,351 శాంపిల్స్ పరీక్షించగా 9,927 మంది కరోనా పాజిటివ్ నిర్ధారించారు.
కరోనా వల్ల చిత్తూరులో 16 మంది, అనంతపూర్‌లో 11 మంది, కడపలో 10 మంది, ప్రకాశంలో 10 మంది, తూర్పుగోదావరిలో 8 మంది, పశ్చిమ గోదావరిలో 8 మంది, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖలో ఆరుగురు, కృష్ణలో నలుగురు, విజయనగరంలో ఒక్కరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 9,419 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.. రాష్ట్రంలో 33,56,852 శాంపిల్స్ పరీక్షించారు.
అనంతపుర్ జిల్లాలో 494 కేసులు చిత్తూరులో 967 కేసులు, తూర్పు గోదావరిలో 1353 కేసులు, గుంటూరులో 917 కేసులు, కడపలో 521 కేసులు, క్రిష్టా 322 కేసులు, కర్నూలులో 781 కేసులు, నెల్లూరులో 949 కేసులు, ప్రకాశంలో 705 కేసులు, శ్రీకాకుళంలో 552 కేసులు, విశాఖపట్నంలో 846 కేసులు, విజయనగరంలో 667 కేసులు, పశ్చిమ గోదావరిలో 853 కేసులు నమోదయ్యాయి.