Fire Broke Out : విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

బీఎఫ్2లో ట్యూబ్ కు రంద్రం పడి ద్రావకం నేలపాలైంది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది.

Visakha 11zon

Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. బీఎఫ్2లో ట్యూబ్ కు రంద్రం పడి ఉక్కు ద్రావకం నేలపాలైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది.

అగ్నిప్రమాదం కారణంగా రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ప్రమాద ఘటనపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విచారణకు ఆదేశించింది. గతంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లో పలు అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి.

Bhavani Deeksha : నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు

గతేడాది డిసెంబర్ లో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఎస్ ఎమ్ ఎస్ -2 లో లాడిల్ తెగిపోయింది. సుమారు కోటి రూపాయల ఉక్కు ద్రావణం కిందపడిపోయింది. దీంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు గాయాలు అయ్యాయి.