Bhavani Deeksha : నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు
భవానీల రద్దీ దృష్ట్యా మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. జల్లు స్నానాల కోసం 500 షవర్లు, ఇరుముడులు సమర్పించేందుకు 50 స్టాండ్లతో పాటు గురు భవానీలను దుర్గగుడి అధికారులు సిద్ధం చేసింది.

Bhavani
Bhavani Deeksha retires on Indrakeeladri : నేటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు జరుగనున్నాయి. భవానీ దీక్షా విరమణలు ఐదురోజుల పాటు జరగనున్నాయి. 4 నుంచి 5 లక్షల మధ్య భవానీలు అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు వస్తారని అధికారుల అంచనా.
భవానీల రద్దీ దృష్ట్యా మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. జల్లు స్నానాల కోసం 500 షవర్లు, ఇరుముడులు సమర్పించేందుకు 50 స్టాండ్లతో పాటు గురు భవానీలను దుర్గగుడి అధికారులు సిద్ధం చేసింది. కొండ చుట్టూ దాదాపు పది కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షణకు అనుమతి ఇచ్చారు.
Falling Temperatures : తెలంగాణను వణికిస్తోన్న చలి పులి.. సీజనల్ వ్యాధులతో జాగ్రత్త..!
మార్గం మధ్యలో భవానీలకు ఇబ్బందులు తలెత్తకుండా దుర్గగుడి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. భవానీల కోసం దుర్గగుడి అధికారులు అన్నీ ఉచిత దర్శనాలే కల్పించారు. ప్రతి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు.
ఇవాళ ఉదయం 8.30 నిముషాల నుంచి అమ్మవారి దర్శనానికి భవానీలకు అనుమతి ఇస్తారు. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని దుర్గగుడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇరుముడితో వచ్చే భవానీలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 2 వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.