Ring Net Dispute : రింగు వలల వివాదంపై జెంటిల్‌మెన్ ఒప్పందం

సంప్రదాయ, రింగు వలల మత్స్యకారుల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. రింగు వలల వివాదంపై జెంటిల్ మెన్ ఒప్పందం కుదిరింది. మత్స్యకార గ్రామాల పెద్దలతో మంత్రి సీదిరి అప్పల రాజు సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, పోలీస్ ఉన్నతాధికారులు, ఇరు వర్గాల మత్స్యకారులు పాల్గొన్నారు.

ring net dispute : సంప్రదాయ, రింగు వలల మత్స్యకారుల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. రింగు వలల వివాదంపై జెంటిల్ మెన్ ఒప్పందం కుదిరింది. మత్స్యకార గ్రామాల పెద్దలతో మంత్రి సీదిరి అప్పల రాజు సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, పోలీస్ ఉన్నతాధికారులు, ఇరు వర్గాల మత్స్యకారులు పాల్గొన్నారు.

ఇకపై ఎలాంటి వివాదాలకు దిగకుండా జాగ్రత్త పడతామని మత్స్యకార పెద్దలు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన రింగు వలల వినియోగ దారులపై చర్యలు తప్పవన్నారు. నిజంగా గట్లపై చర్యలు తీసుకుంటే ఇరు వర్గాలకు కష్టం అవుతుందన్నారు. అనేక అంశాలపై మరోసారి చర్చించామని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

Ringuvala Dispute : విశాఖలో మళ్లీ సంప్రదాయ-రింగువల మత్స్యకారుల మధ్య గొడవ

గతంలో తలెత్తిన సమస్యలపై మాట్లాడామన్నారు. జెంటిల్‌మెన్‌ ఒప్పందం ప్రకారం మత్య్సకారులు వేట కొనసాగిస్తారని మరోసారి స్పష్టం చేశారు. కొత్త సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని…ఆయా గ్రామాల్లో మత్య్సకారులు సామరస్యంగా చర్చించుకోవాలన్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా…మంచి పరిష్కారం సూచించామన్నారు. బోట్లు కాల్చివేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు