Ringuvala Dispute : విశాఖలో మళ్లీ సంప్రదాయ-రింగువల మత్స్యకారుల మధ్య గొడవ

విశాఖ జిల్లా వాసవానిపాలెంలో టెన్షన్‌..టెన్షన్‌ నెలకొంది. మత్స్యకారుల మధ్య వల వివాదం మళ్లీ మొదలైంది. సంప్రదాయ-రింగు వల మత్స్యకారుల మధ్య గొడవ తలెత్తడంతో.. వారు రెండు వర్గాలుగా విడిపోయారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి గొడవ మొదలైంది.

Ringuvala Dispute : విశాఖలో మళ్లీ సంప్రదాయ-రింగువల మత్స్యకారుల మధ్య గొడవ

Visakha

Ringuvala Dispute : విశాఖ జిల్లా వాసవానిపాలెంలో టెన్షన్‌..టెన్షన్‌ నెలకొంది. మత్స్యకారుల మధ్య వల వివాదం మళ్లీ మొదలైంది. సంప్రదాయ-రింగు వల మత్స్యకారుల మధ్య గొడవ తలెత్తడంతో.. వారు రెండు వర్గాలుగా విడిపోయారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి గొడవ మొదలైంది. లంగరు వేసిన 6 తెప్పలు, వలలను సంప్రదాయ మత్స్యకారులు తగలబెట్టారు. దీంతో జాలరి ఎండాడ, పెదజాలరిపేటలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అటు తెప్పలు, వలలు తగలబడటంతో వాసవానిపాలెంలో రింగువల మత్స్యకారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రింగు వల మత్స్యకారులు ఆందోళన కొనసాగుతోంది. సంప్రదాయ మత్స్యకారులకు చెందిన మూడు తెప్పలను రింగు వల మత్స్యకారులు జాలరి ఎండాడ తీరానికి తీసుకొచ్చారు. తమకు న్యాయం జరిగేంతవరకు వారి తెప్పలను ఇచ్చేది లేదని రింగు వల మత్స్యకారులు అంటున్నారు. ఇరు వర్గాల వారికి మత్స్యశాఖ పోలీసు అధికారులు నచ్చచెప్పుతున్నారు.

Ring Nets Controversy : మరోసారి విశాఖలో ఉద్రికత్త.. రోడ్డు పైకి వేలాదిమంది మత్స్యకారులు

గతంలో ప్రకాశం జిల్లాలో మత్స్యకార గ్రామాల మధ్య బల్లవల, ఐలవలలు చిచ్చురేపాయి. ఇరు వర్గాల మత్స్యకారులు పరస్పరం దాడులు చేసుకున్నారు. విశాఖ జిల్లాల్లో రింగువల వివాదం నెలకొంది. సంప్రదాయ మత్స్యకారులకు, రింగువల ఉపయోగిస్తున్న మత్స్యకారులకు మధ్య విశాఖ సాగరతీరంలో వివాదం తలెత్తింది. వాసవాని పాలెం, పెదజాలరి పేట మత్స్యకారుల మధ్య రింగువల వాడకం విషయంలో ఘర్షణ జరిగింది. రింగు వలలతో వేటకు వెళ్తున్న వారిని సంప్రదాయ మత్స్యకారులు అడ్డుకున్నారు.

బల్లవల, ఐలవల మత్స్యకారుల మధ్య చెలరేగిన వివాదం…కఠారీ పాలెం సముద్ర తీరంలో ఉద్రిక్తత

వారిని వేటకు వెళ్లనీకుండా రింగు వల జాలర్లు అడ్డుకున్నారు. రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారులు తీరంలోనే మకాం వేశారు. దీంతో పెద్ద జాలరిపేట దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాయి. సమస్యను పరిష్కరించేందుకు రెండు వర్గాలకు చెందిన మత్స్యకారులతో పోలీసులు చర్చిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో మత్స్యకార గ్రామాల మధ్య చిచ్చురేపిన వలలపై జిల్లా మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. బల్లవల, ఐలవలలపై తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందన్నారు. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ఐలవల, బల్లవలలపై ఇండియన్ ఫిషరీయాక్ట్ 145 సెక్షన్ ప్రకారం నిర్ణయం తీసుకున్నామని.. ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.