బల్లవల, ఐలవల మత్స్యకారుల మధ్య చెలరేగిన వివాదం…కఠారీ పాలెం సముద్ర తీరంలో ఉద్రిక్తత

  • Published By: bheemraj ,Published On : December 11, 2020 / 02:30 PM IST
బల్లవల, ఐలవల మత్స్యకారుల మధ్య చెలరేగిన వివాదం…కఠారీ పాలెం సముద్ర తీరంలో ఉద్రిక్తత

Controversy between Ballavala and Ailavala fishermen : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం.. కఠారీపాలెం సముద్ర తీరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బల్లవల, ఐలవల మత్య్సకారుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనుసాగుతోంది. ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఫిషరీ జేడీ, చీరాల డీఎస్పీ కఠారీ పాలెం గ్రామానికి వెళ్లారు.



గ్రామానికి వచ్చిన ఫిషరీ అధికారులకు.. ఐలవల ఉపయోగిస్తున్న 74 గ్రామాల మత్స్యకారులు …. బల్లవల వాడకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బల్లవల మత్స్యకారులు అధికారులతో చర్చలు జరపకుండానే సముద్రంలో వేటకు వెళ్లారు. దీనిపై ఐలవల మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



సముద్రంలోకి వెళ్లిన బల్లవల మత్స్యకారులను వెనక్కి తీసుకొస్తామంటూ ఐలవల మత్స్యకారులు బోటును తీసుకుని సముద్రంలోకి వెళ్లారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీగా పోలీసులు మోహరించారు.